https://oktelugu.com/

IMD: రైతులకు బిగ్ రిలీఫ్

జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుంది. గత ఐదు దశాబ్దాల వర్షపాత నమోదును పరిశీలిస్తే.. 87 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యేది.

Written By:
  • Dharma
  • , Updated On : April 16, 2024 / 10:53 AM IST

    IMD

    Follow us on

    IMD: రైతులకు శుభవార్త. ఈ ఏడాది అధికంగా వర్షాలు కురవనున్నాయి. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానుంది. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రత్యేక ప్రకటన చేసింది. నాలుగు నెలల నైరుతి రుతుపవనాల సీజన్ కు సంబంధించి వాతావరణ శాఖ తొలి దశ బులిటెన్ ను విడుదల చేసింది. నైరుతిలో జోరుగా వానలు పడతాయని తేల్చి చెప్పింది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని.. దీర్ఘకాలిక సగటులో 106% నమోదయ్య చాన్స్ ఉన్నట్లు స్పష్టం చేసింది. ఉత్తర, దక్షిణ, పశ్చిమ, మధ్య భారత దేశంలో నైరుతి ప్రభావంతో అధిక వర్షపాతం నమోదవుతుందని తాజాగా ప్రకటించడం విశేషం.

    జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుంది. గత ఐదు దశాబ్దాల వర్షపాత నమోదును పరిశీలిస్తే.. 87 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యేది. కానీ ఈ ఏడాది ఆ సీజన్ లో 106% నమోదవుతుందని అంచనా వేసింది. ఎల్ నినో ప్రభావంతో గత ఏడాది నైరుతి సీజన్లో వర్షపాతం చాలా తక్కువగా నమోదయింది. 868.6 మిల్లీమీటర్లకు గాను.. 820 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో.. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రిజర్వాయర్లలో నీటి మట్టాలు గణనీయంగా పడిపోయాయి. ఈ ఏడాది మాత్రం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలియడం ఉపశమనం కలిగించే విషయం.

    గత ఏడాది తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది ఒక్క శ్రీకాకుళం జిల్లాకు తప్పించి..అన్ని జిల్లాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఒడిస్సా, దక్షిణ చత్తీస్గఢ్ తో పాటు ఆనించి ఉన్న శ్రీకాకుళంలో వర్షపాతం నమోదు అంతంతమాత్రంగా ఉండనుంది. నైరుతి రుతుపవనాల సీజన్లో వర్షాలకు బంగాళాఖాతం అత్యంత కీలకం. అల్పపీడనాలు, వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురుస్తుంటాయి. అయితే నైరుతి సీజన్లలో విపత్తులతో.. ఒడిస్సా, చత్తీస్గడ్ గట్టెక్కనున్నాయని తేలింది. మొత్తానికైతే నైరుతి సీజన్ లోనే రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం హర్షించదగ్గ పరిణామం. రైతులకు ఉపశమనం కలిగించే విషయం.