Somesh Kumar IAS: సోమేష్‌కుమార్‌ మరో బాగోతం.. క్విడ్‌ప్రోకో భూములకు లక్షల్లో రైతుబంధు!

కొత్తపల్లి గ్రామంలో కొనుగోలు చేసి తన భార్య పేరిట రిజిస్ట్రేషన్‌ చేసిన 25.19 ఎకరాల భూమికి సోమేష్‌కుమార్‌ రైతబంధు కింద రూ.14 లక్షల తీసుకున్నాడు. ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.

Written By: Raj Shekar, Updated On : February 1, 2024 11:44 am

Somesh Kumar IAS

Follow us on

Somesh Kumar IAS: తెలంగాణ మాజీ సీఎస్‌ సోమేష్‌కుమార్‌ బాగోతాలు ఒక్కొక్కటీ బయట పడుతున్నాయి. హైదరాబాద్‌ శివారులోకి కొత్తపల్లి గ్రామంలో ఫార్మాసిటీ వస్తుందని ముందుగానే తెలుసుకున్న సోమేష్‌కుమార్‌ అక్కడ ఆయన భార్యపేరిట 25 ఎకరాలు కొనుగోలు చేశాడు. ఆయన బంధువులతో మరో 125 ఎకరాలు కొనిపిచ్చారు. ఇక్క ఇక్కడ ఆయన కొనుగోలు చేసిన భూమి ధర ఎంత అంటే ఎకరాకు కేవలం రూ.2.5 లక్షలు మాత్రమే. ఇంత తక్కువ ధరకు భూములు కొనడానికి కారణం ఏమై ఉంటుందని ఇప్పటికే విజిలెన్స్‌ ఆరా తీస్తోంది. క్విడ్‌ప్రోకో జరిగి ఉంటుందని అనుమానిస్తోంది. ఈమేరకు విచారణ జరుగుతుండగానే ఆయన మరో భాగోతం బయటపడింది.

ఆ భూములకు రూ.14 లక్షల రైతుబంధు..
కొత్తపల్లి గ్రామంలో కొనుగోలు చేసి తన భార్య పేరిట రిజిస్ట్రేషన్‌ చేసిన 25.19 ఎకరాల భూమికి సోమేష్‌కుమార్‌ రైతబంధు కింద రూ.14 లక్షల తీసుకున్నాడు. ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. సోమేష్‌ కొనుగోలు చేసిన భూమి వ్యవసాయ యోగ్యమైనది కాదు. మొత్తం రాళ్లు, గుట్టలతోనే ఉంది. ఒక్క పంట కూడా సాగుచేయలేదు. అయినా ఆ భూమికి ఆరు నెలలకు రూ.1,27,375 చొప్పున ఇప్పటి వరకు సోమేష్‌ కుమార్‌ భార్య ఖాతాలో రూ.14 లక్షల రైతుబంధ జమైంది.

డీవోపీటికి సమాచారం ఇవ్వకుండా..
భూముల కొనుగోలుతోపాటు రైతుబంధు తీసుకున్న విషయాన్ని సోమేష్‌ ఢిల్లీలో డీవోపీటికీ సమాచారం ఇవ్వాలి. కానీ, ఆయన ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం సంచలనంగా మారింది. సోమేష్‌కుమార్‌ తరహాలోనే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో బ్యూరోక్రాట్లు ఫామ్‌హౌస్‌లు, భూములు పెద్ద ఎత్తున సమకూర్చుకున్నారని తెలుస్తోంది. వాటికి రైతుంబంధు కూడా తీసుకుంటుండడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్న ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సామాన్య రైతులు కోరుతున్నారు.

ఏసీబీ ఫోకస్‌
ఇదిలా ఉండగా సోమేష్‌కుమార్‌ తన భార్య పేరిట కొనుగోలు చేసిన భూములపై ఏసీబీ దృష్టిపెట్టినట్లు తెలిసింది. ఫార్మాసిటీ అంశం ముందే తెలుసుకుని అక్కడ భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫార్మాసిటీకి కేవలం కిలోమీటర్‌ దూరంలో 25.19 ఎకరాల భూమిని సోమేష్‌ కొనుగోలు చేశారు. రెవెన్యూ స్పెషల్‌ ఆఫీసర్‌గా ఉన్నప్పుడే ఈ భూముల కొనుగోలు జరిగినట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ జరిగింది. దాసరి రామమూర్తి, ఎల్లా వరలక్ష్మి, నామాల వేణుగోపాల్‌ ఇందులో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. వారిని కూడా ఏసీబీ విచారణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోకాపేటలో వారి విల్లాలకు పర్మిషన్‌ ఇవ్వడంతో సోమేష్‌కుమార్‌కు కొత్తపల్లి భూముల కట్టబెట్టారని తెలుస్తోంది.