Homeఎంటర్టైన్మెంట్Vishnu Priya Bhimeneni Sister: యాంకర్ విష్ణుప్రియ చెల్లిని చూశారా? ఆమె ఏం చేస్తుంది? ఎలా...

Vishnu Priya Bhimeneni Sister: యాంకర్ విష్ణుప్రియ చెల్లిని చూశారా? ఆమె ఏం చేస్తుంది? ఎలా ఉందంటే?

Vishnu Priya Bhimeneni Sister: బుల్లితెర యాంకర్ గా ఫేమస్ అయిన విష్ణు ప్రియ సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించింది. ఎప్పటికప్పడు హాట్ ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తూ ఉంటుంది. విష్ణు ప్రియ ఇంస్టాగ్రామ్ పోస్టులు వైరల్ గా మారుతుంటాయి. ఆమెకు అదే రేంజ్ లో అసభ్యకర కామెంట్లు కూడా వస్తుంటాయి. అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది ఈ బ్యూటీ. అయితే తాజాగా విష్ణు ప్రియ తన చెల్లెలు పావని తో కలిసి వీడియో చేసింది.

అందులో తన చెల్లెలు ఆమెకు ఒక గిఫ్ట్ ఇచ్చింది. దీంతో విష్ణు ప్రియ తెగ సంబ ర పడిపోయింది. అయితే చెల్లి పావని కొంత కాలంగా ఇంటికి దూరంగా ఉంటుందని విష్ణు ప్రియ పేర్కొంది. గతంలో విష్ణు ప్రియ ఈటీవీలో ప్రసారమైన ఓ స్పెషల్ ఈవెంట్ లో తొలిసారి పావనిని పరిచయం చేసింది. ఆ తర్వాత పలుమార్లు పావని, విష్ణుప్రియతో కలిసి కొన్ని ఈవెంట్లలో కనిపించింది. అయితే ఇప్పుడు సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ ఇంటికి దూరంగా ఉంటుందట.

ఇక రీసెంట్ గా ఇంటికి వచ్చిన పావని తనకు డైమండ్ నెక్లెస్ బహుమతిగా ఇచ్చిందంటూ విష్ణు ప్రియ చెప్పుకొచ్చింది. ఇక ఈ గిఫ్ట్ తన తల్లి వర్ధంతి కి ఒక రోజు ముందు తన రూపంలో వచ్చిందంటూ వివరించింది. ఇక విష్ణు ప్రియ కెరీర్ పరంగా దూసుకుపోతోంది. గత ఏడాది ‘ దయ ‘ వెబ్ సిరీస్ లో జర్నలిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సిరీస్లో నటనకు ప్రశంసలు కురిశాయి. అలాగే త్వరలో దయ 2 సిరీస్ తో కూడా విష్షుప్రియ మెప్పించనుంది.

గతంలో సీరియల్ నటుడు మానస్ తో కలిసి ‘జరీ జరీ పంచ’ సాంగ్ చేసింది. ఆ పాట మిలియన్ వ్యూస్ కొల్లగొట్టింది. అప్పట్లో యూట్యూబ్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. బుల్లితెర పై విష్ణుప్రియ హవా తగ్గినప్పటికీ .. సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తూ హీట్ పుట్టిస్తుంది. రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది విష్ణు ప్రియ.

Exit mobile version