AP SSC Results: విజయవాడ బందరు రోడ్డులోని ఆర్అండ్ బీ భవనమది. శనివారం ఉదయం 11 గంటలకు మీడియా ప్రతినిధులు, విద్యాశాఖ అధికారుల హడావుడితో సందడి వాతావరణ నెలకొంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రాసిన సుమారు 6 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామని చెప్పిన సమయం అసన్నమైంది. కానీ ఎవరూ కానరావడం లేదు. . ఫలితాలు విడుదల చేస్తారని ప్రభుత్వం చెప్పిన పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ జాడలేదు. అనుకున్న సమయానికి సమయం మించిపోతున్నాఆయన మాత్రం రాలేదు. తీరా చావుకబురు చల్లగా అన్నట్లు.. ఫలితాల విడుదల సోమవారానికి వాయిదా వేశామన్న సందేశాన్ని మీడియా ప్రతినిధులకు పంపించారు. మీడియా ప్రతినిధులు నిరాశతో వెనుదిరిగారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు సైతం నిట్టూర్చారు.

Also Read: Telangana Police: బలమే.. బలహీనత!.. రాజకీయ ఒత్తిడిలో తెలంగాణ పోలీస్
ప్రభుత్వం విఫలం..
పదో తరగతి ఫలితాలను విడుదల చేయడంతో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. ఫలితాల విడుదల అంటే సరిగ్గా చెప్పిన సమయానికి ప్రకటించడం ఆనవాయితీ. ఏళ్లుగా అదే పని చేస్తున్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా చెప్పిన సమయానికి ఫలితాలు విడుదల చేస్తారు. జగన్ సర్కారు మాత్రం చెప్పిన సమయానికి పదో తరగతి ఫలితాలను ప్రకటటించ లేక నవ్వులపాలైంది. అయితే తొలుత ఐదు నిమిషాలు ఆలస్యం ఉంటుందేమోనని అనుకున్నారు. 5 కాదు 15 నిమిషాలైనా అధికారులెవరూ రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, వారి కుటుంబసభ్యులు అప్‌డేట్ కోసం, ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఫలితాల విడుదల వాయిదా వేస్తున్నట్టు మీడియా ప్రతినిధులకు సందేశం వచ్చింది. అయితే కొందరు దీన్ని నమ్మలేదు. వాయిదా వేస్తే ముందురోజే ప్రకటిస్తారు కదా అన్న సందేహం వచ్చింది. చెప్పిన సమయానికి ఫలితాలు విడుదలలో చేయడంలో ప్రభుత్వం ఫెయిలైందని తర్వాత అర్థమైంది.

ప్రస్టేజ్ ఇష్యూ
పదో తరగతి ఫలితాల విడుదల వాయిదా వెనుక మంత్రి, అధికారుల మధ్య ఈగో సమస్యలు కారణమని తెలుస్తోంది. విద్యా శాఖ మంత్రినైన తాను లేకుండా ఫలితాలు విడుదలను చేయాలని నిర్ణయించడంపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. మంత్రికి ముందే చెప్పామని, ఆయన రాననని చెబితేనే తాము ఫలితాలను విడుదల చేసేందుకు సమయం ప్రకటించామన్నది అధికారుల వాదనగా ఉంది. ఫలితాల విడుదల సమయానికి ఇదే విషయంపై ఈగోలు పెరిగి వాయిదాకు దారితీసిందని చెబుతున్నారు. కారణం ఏదైనా ప్రకటించిన సమయానికి ఫలితాలు విడుదల చేయకపోవడం ఇదే తొలిసారి. వాస్తవానికి పదో తరగతి పరీక్షల మూల్యాంకనం కొన్నిరోజుల క్రితమే పూర్తయింది. అంతా సిద్ధమయ్యాకే ఫలితాల విడుదలకు తేదీ, సమయం ప్రకటించారు. అయినా అప్పటికప్పుడు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. విద్యార్థుల చదువు పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో తెలియజేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదని చెబుతున్నారు.
Also Read:BJP- Jagan: జగన్‌తో దోస్తీ ముప్పేనా? ఆర్కే భాష్యంలో ఆంతర్యం ఆదెనా?
[…] […]