https://oktelugu.com/

గుడ్ న్యూస్: భూముల ధరలు పెరగవు..

భూములు కొనేవారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచడం లేదని తెలపడంతో కాస్త ఊరటనిచ్చినట్లయింది. ప్రతీ ఏడాది ఆగస్టులో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతూ వస్తోంది. అయితే ఈసారి కూడా ప్రభుత్వం పెంచుతుందని అందరూ భావించారు. దీంతో రిలయర్లతో పాటు భూములు కొనుక్కునేవారు కాస్త ఆందోళన చెందారు. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారిలో హర్షాతికేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతీ సంవత్సరం ఆగస్టులో ఏపీ ప్రభుత్వం భూముల ధరలు పెంచుతూ వస్తోంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : July 10, 2021 / 11:21 AM IST
    Follow us on

    భూములు కొనేవారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచడం లేదని తెలపడంతో కాస్త ఊరటనిచ్చినట్లయింది. ప్రతీ ఏడాది ఆగస్టులో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతూ వస్తోంది. అయితే ఈసారి కూడా ప్రభుత్వం పెంచుతుందని అందరూ భావించారు. దీంతో రిలయర్లతో పాటు భూములు కొనుక్కునేవారు కాస్త ఆందోళన చెందారు. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారిలో హర్షాతికేకాలు వ్యక్తమవుతున్నాయి.

    ప్రతీ సంవత్సరం ఆగస్టులో ఏపీ ప్రభుత్వం భూముల ధరలు పెంచుతూ వస్తోంది. ఈసారి కూడా పెరుగుతాయని అనుకున్నారు. గత సంవత్సరం భూముల ధరలు 10 నంచి 30 శాతం వరకు పెంచింది. విజయవాడ, గుంటూరు నగరాల్లో 10 శాతం, విశాఖపట్నంలో 25 శాతం అనంతపురంలో 30 శాతం మేరకు మార్కెట్ ధరలను పెంచారు. దీంతో గతేడాది ప్రభుత్వానికి సుమారు 800 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది మరింతగా పెంచితే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని రియల్టర్లు భావించారు.

    అయితే కరోనా కారణంగా ఈసారి భూముల ధరలు పెరిగితే నష్టపోతామని కొందరు రియల్టర్లు, భూములపై ఇన్వెస్ట్ చేసేవారు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి భూముల ధరలు పెంచడం లేదని ప్రకటించింది. దీంతో ప్రజల్లో ఉపశమనం కలిగింది. కరోనా కారణంగా సామాన్యుల నుంచి అన్ని రంగాల వారు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం తీవ్రంగా నష్టపోయింది.

    ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో కొనుగోలు శక్తి పడిపోయంది. దీంతో భూములు అమ్మేవారు ముందుకు వచ్చినా.. కొనేవారు కరువయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భూముల ధరలు పెంచితే మరింతగా కొనుగోలు శక్తి పడిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితులను బీరీజు వేసుకున్న జగన్ సర్కార్ భూముల ధరల పెంపును వెనక్కి తీసుకుంది. అయితే కొందరు ప్రభుత్వ భూముల ధరల పెంపును విరమించుకున్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటుందా..? అనే అనుమానాలు లేకపోలేదు. త్వరలో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు భూములపై ఇన్వెస్ట్ చేసే అవకాశాలు తక్కవేనంటున్నారు.