Jammu and Kashmir Elections 2024 : జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంతంగా తొలి విడత పోలింగ్‌.. రికార్డు స్థాయిలో ఓటెత్తిన ప్రజలు!

భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్‌లో పదేళ్ల తర్వాత బుధవారం(సెప్టెంబర్‌ 18న) పోలింగ్‌ జరిగింది ఆర్టిక్‌ 370 రద్దు తర్వాత మూడు విడతల్లో పోలింగ్‌ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడత పోలింగ్‌ ప్రశాతంగా జరిగింది.

Written By: NARESH, Updated On : September 18, 2024 10:43 pm
Follow us on

Jammu and Kashmir Elections 2024 : భారత దేశానికి శిరస్సు లాంటి రాష్ట్రం.. పర్యాటకుల స్వర్గధామం జమ్మూ కాశ్మీర్‌. స్వాతత్య్రం వచ్చిన నాటి నుంచి ఈ రాష్ట్రం భారత్‌లో భాగమే. కానీ, దేశ విభజన సమయంలో జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించారు. భారత దేశంలో భాగం అయినా.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 ప్రకారం దేశంలోని ఏ చట్టాలు ఇక్కడ వర్తించకుండా అక్కడి చట్టాలు, వేరేగా రూపొందించుకునే స్వేచ్ఛ కల్పించింది. దీంతో 75 ఏళ్లుగా జమ్మూకాశ్మీర్‌ స్వయం ప్రతిపత్తితో పాలన సాగింది. అయితే ఆర్టికల్‌ 370 కారణంగా రాష్ట్రంలో ఉగ్రవాదం పెరిగినట్లు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఐదేళ్ల క్రితం కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టిక్‌ 370ను రద్దు చేయడమే కాకుండా రాష్ట్రాన్ని జమ్మూ, కాశ్మీర్‌గా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అప్పటి నుంచి రాష్ట్రపతి పాలన విధించింది.2014 తర్వాత అక్కడ ఎన్నికలు జరుగలేదు. ఇటీవల సుప్రీం కోర్టు జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో ఎట్టకేలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది.

ప్రశాంతంగా తొలి విడత పోలింగ్‌..
ఇక జమ్మూలోని 16, కాశ్మీర్‌లోని 8 నియోజవర్గాలు కలిపి మొత్తం 24 నియోజకవర్గాలకు బుధవారం(సెప్టెంబర్‌ 18న) తొలివిడత పోలింగ్‌ నిర్వహించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ ప్రశాతంగా జరిగింది. పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు, ఆర్మీ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది.దీంతో తొలి విడత పోలింగ్‌ ప్రశాతంగా ముగిసింది.

రికార్డుస్థాయిలో పోలింగ్‌…
ఇక పదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో తమ ఓటుహక్కు వనియోగించుకునేందుకు కశ్మీరీలు ఉత్సాహం చూపారు. ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు క్యూ కట్టారు. దీంతో తొలి విడత పోలింగ్‌లో సాయంత్రం 5 గంటల వరకు 58.19 శాతం పోలింగ్‌ నమోదైంది. మరో గంట పోలింగ్‌ మిగిలి ఉంది. కేంద్రాల వద్ద భారీగా ఓటర్లు క్యూలో ఉన్నారు. దీంతో 60 శాతానికిపైగా పోలింగ్‌ నమోదయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు అత్యధిక ఓటింగ్‌ కిష్త్వార్‌ జిల్లాలో 77.23 శాతంగా నమోదైంది. అత్యల్ప ఓటింగ్‌ పుల్వామాలో 43.87 శాతంగా నమోదైంది. రెండో విడత పోలింగ్‌ సెప్టెంబర్‌ 25న జరుగుతుంది.

జిల్లాల వారీగా నమోదైన పోలింగ్‌ శాతం ఇదీ..
అనంతనాగ్‌ 54.17 శాతం
దోడా 69.33 శాతం
కిష్త్వార్‌ 77.23 శాతం
కుల్గామ్‌ 59.62 శాతం
పుల్వామా 43.87 శాతం
రాంబన్‌ 68.71 శాతం
షోపియాన్‌ 53.64 శాతం