Mathu Vadalara 3: మన టాలీవుడ్ లో సీక్వెల్స్ సక్సెస్ అయితే ఏ స్థాయి వసూళ్లు వస్తాయో, నిర్మాతలకు ఎలాంటి లాభాలు వస్తాయో గతంలో మనం ఎన్నో సందర్భాలలో చూసాము. అయితే సీక్వెల్స్ మన ఇండస్ట్రీ లో సక్సెస్ సాధించడం అనేది చాలా తక్కువ శాతం మాత్రమే జరిగింది. వాటిల్లో రీసెంట్ గా విడుదలైన ‘మత్తు వదలరా 2 ‘ చిత్రం ఒకటి. 2019 వ సంవత్సరం లో రితేష్ రానా దర్శకత్వం లో తెరకెక్కిన ‘మత్తు వదలరా’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా కీరవాణి కొడుకు శ్రీ సింహా ఇండస్ట్రీ కి హీరోగా పరిచయం అయ్యాడు. ఇప్పుడు సీక్వెల్ లో కూడా ఆయనే హీరో గా నటించాడు. ఈ చిత్రం విడుదలైన రోజు నుండి హీరో శ్రీ సింహా గురించి ఎవ్వరూ మాట్లాడుకోవడం లేదు, కేవలం కమెడియన్ సత్య గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు. ఆ స్థాయిలో సత్య తన కామెడీ టైమింగ్ తో రెచ్చిపోయాడు. హీరో ని సైతం డామినేట్ చేసాడు.
ఈరోజు ఈ చిత్రం ఇంత పెద్ద హిట్ అయ్యింది అంటే దానికి కారణం సత్య కామెడీ నే. కేవలం 5 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 8 కోట్ల రూపాయలకు జరగగా, అప్పుడే మూడు కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి. ఫుల్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి, ఆ స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ ‘మత్తు వదలరా’ ఒక ఫ్రాంచైజ్ లాగా వస్తుందని. త్వరలోనే పార్ట్ 3 కూడా ప్రారంభించబోతున్నామని డైరెక్టర్ రితేష్ రానా సక్సెస్ మీట్ లో తెలిపాడు.
అయితే మొదటి రెండు భాగాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి కాబట్టి, మూడవ భాగాన్ని భారీగా తీయాలనే ప్లాన్ లో ఉన్నాడట డైరెక్టర్. అందులో భాగంగా ఈ సినిమాలోకి ఒక మంచి మార్కెట్ ఉన్న హీరోని తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. వరుసగా మూడు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని, స్టార్ లీగ్ లోకి అడుగు దూరంలో ఉన్న నేచురల్ స్టార్ నాని ని ఈ సినిమాలో హీరోగా తీసుకునే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్. నాని కూడా అందుకు సానుకూలంగా రెస్పాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. త్వరలోనే పూర్తి స్థాయి స్క్రిప్ట్ ని సిద్ధం చేసి, నాని కి వినిపించబోతున్నాడట. మరి ఈ ప్రాజెక్ట్ ఎంత మేరకు కార్యరూపం దాలుస్తుందో చూడాలి. వివిధ జానర్స్ లో సినిమాలు తీస్తూ, తన మార్కెట్ ని పెంచుకుంటూ పోతున్న నాని కి ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ చేయాలనీ ఉందని ఇటీవల అనేక ఇంటర్వ్యూస్ లో తెలిపాడు. అందుకు తగ్గట్టుగానే ఆయన ఈ సినిమాని ఎంచుకున్నట్టు తెలుస్తుంది.