WTC final : ఫస్ట్ ర్యాంక్ లో ఉన్న ఇండియా స్థానానికి ఇబ్బందా… నాలుగో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ కు బెర్త్ ఖాయమా.. ఇదేందయ్యా ఇది.. అంతు పట్టకుండా ఉందే..

బంగ్లాదేశ్ జట్టుతో జరిగే రెండు టెస్టుల యుద్ధానికి భారత్ సిద్ధమైంది. సెప్టెంబర్ 19 నుంచి ఈ ప్రతిష్టాత్మకమైన సిరీస్ మొదలుకానుంది.. భారత జట్టుకు కలసి వచ్చిన చెన్నై మైదానంపై ఈ సిరీస్ షురూ కానుంది.. రెండు టెస్టుల అనంతరం భారత్ బంగ్లాదేశ్ తో 3 t20 సిరీస్ ఆడుతుంది.

Written By: NARESH, Updated On : September 18, 2024 10:45 pm
Follow us on

WTC final : బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ బెర్త్ రేసు చర్చకు వస్తోంది. గత రెండు ఫైనల్స్ లోకి భారత్ వెళ్ళింది. ఒకసారి న్యూజిలాండ్ చేతిలో ఓడింది. మరోసారి ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది.. ముచ్చటగా మూడోసారి ఫైనల్ లో ప్రవేశించడానికి భారత సిద్ధమైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో భారత్ ప్రస్తుతానికి ప్రథమ స్థానంలో ఉంది. అయితే ఫైనల్ వెళ్లడం రోహిత్ సేనకు అంత సులభం కాదు. టాప్ -4 జాబితాలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లతో భారత్ పది టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టేబుల్ లో పాయింట్ల ప్రకారం భారత్ 74 పాయింట్లు, 68.52 శాతం విజయాలు, ఆస్ట్రేలియా 90 పాయింట్లు, 62.50 శాతం విజయాలు, న్యూజిలాండ్ 36 పాయింట్లు, 50% విజయాలు, బంగ్లాదేశ్ 33 పాయింట్లు, 45.33 శాతం విజయాలతో టాప్ -4 స్థానాల్లో ఉన్నాయి. డబ్ల్యూటీసీ సీజన్ ముగిసే సమయానికి భారత్ 10 టెస్ట్ లు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్ తో రెండు, న్యూజిలాండ్ తో మూడు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ మ్యాచ్ లు ఆడుతుంది. పాకిస్తాన్ జట్టును వైట్ వాష్ చేసిన బంగ్లాదేశ్ ను భారత్ అంత సులభంగా నమ్మడానికి లేదు..

ఫైనల్ వెళ్లాలంటే

డబ్ల్యూటీసీ ఫైనల్ వెళ్లాలంటే భారత్ కనీసం ఐదు మ్యాచ్ లు గెలవాలి. అప్పుడే రోహిత్ సేనకు బలమైన దారులు ఉంటాయి. ఒకవేళ ఆరు విజయాలు సాధిస్తే ఫైనల్ చేరుకున్నట్టే. దశాబ్దం నుంచి ఆస్ట్రేలియా జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం కళ్ళు కాయలు కాచే లాగా ఎదురుచూస్తోంది. కాబట్టి ఈసారి ఆస్ట్రేలియా నుంచి భారత్ కు తీవ్ర ప్రతిఘటన తప్పదు. అలాంటప్పుడు ఆస్ట్రేలియా జట్టుపై అడుగుపెట్టకముందే రోహిత్ సేన ఫైనల్ బెర్త్ సిద్ధం చేసుకోవాలి.. అందువల్ల భారత జట్టుకు బంగ్లా, న్యూజిలాండ్ సిరీస్ అత్యంత ముఖ్యంగా మారింది. అయితే మిగిలిన 10 టెస్ట్ మ్యాచ్ లలో ఐదు గెలిచి… ఐదు ఓడితే భారత్ సాధించిన విజయాల శాతం 58.77 గా మారుతుంది. ఇప్పుడు భారత జట్టు ఫైనల్ వెళ్లడానికి అవకాశాలు సంక్లిష్టమవుతాయి. అప్పుడు బంగ్లాదేశ్ ఫైనల్ వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒకవేళ భారత జట్టు చేతిలో బంగ్లాదేశ్ 0-2 తేడాతో ఓడిపోయినప్పటికీ షాంటో సేనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ మరో ఆరు టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. భారత్ తర్వాత వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లతో స్వదేశంలో రెండు టెస్టుల సిరీస్ బంగ్లాదేశ్ ఆడుతుంది. వీటిల్లో బంగ్లా కచ్చితంగా విజయాలు సాధించాలి. అప్పుడు 56.25 విజయాల శాతంతో డబ్ల్యూటీసీ 2023 -25 సీజన్ ముగిస్తుంది. ఇతర జట్ల ఫలితాల ఆధారంగా బంగ్లా ఫైనల్ వినడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మిగిలిన 6 టెస్టులలో బంగ్లా నాలుగు విజయాలు సాధించి.. మిగతా రెండు డ్రాగ ముగిస్తే అప్పుడు ఆ జట్టు విజయ శాతం 60+ గా ఉంటుంది. దానివల్ల ఫైనల్ వెళ్లడానికి ఆ జట్టుకు అవకాశాలుంటాయి. ఒకవేళ అన్నిట్లోనూ గెలిస్తే 72.91 విజయాల శాతంతో ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది.