https://oktelugu.com/

ఉత్కంఠను రేపిన తొలి ఫలితం.. విజేత ఎవరంటే?

పోస్టల్ బ్యాలెట్ ఓటింగులో బీజేపీ సత్తా చాటుతోంది. 150డివిజన్లకు గాను బీజేపీ అభ్యర్థులు 85 స్థానాల్లో.. టీఆర్ఎస్ అభ్యర్థులు 32 స్థానాల్లో.. ఎంఐఎం అభ్యర్థులు 17 స్థానాల్లో.. కాంగ్రెస్ 4 స్థానాల్లో అధిక్యంలో ఉన్నాయి. ఇక పోస్టల్ ఓట్లలో జోరు చూపిస్తున్న బీజేపీ ఇదే ట్రెండ్ కొనసాగిస్తుందా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. Also Read: జీహెచ్ఎంసీ కౌంటింగ్: ఎస్ఈసీ vs హైకోర్టు.. ఏం జరుగనుంది? పోస్టల్ ఓట్ల లెక్కింపు పూర్తవడంతో కొన్నిచోట్ల బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 4, 2020 / 12:09 PM IST
    Follow us on

    పోస్టల్ బ్యాలెట్ ఓటింగులో బీజేపీ సత్తా చాటుతోంది. 150డివిజన్లకు గాను బీజేపీ అభ్యర్థులు 85 స్థానాల్లో.. టీఆర్ఎస్ అభ్యర్థులు 32 స్థానాల్లో.. ఎంఐఎం అభ్యర్థులు 17 స్థానాల్లో.. కాంగ్రెస్ 4 స్థానాల్లో అధిక్యంలో ఉన్నాయి. ఇక పోస్టల్ ఓట్లలో జోరు చూపిస్తున్న బీజేపీ ఇదే ట్రెండ్ కొనసాగిస్తుందా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

    Also Read: జీహెచ్ఎంసీ కౌంటింగ్: ఎస్ఈసీ vs హైకోర్టు.. ఏం జరుగనుంది?

    పోస్టల్ ఓట్ల లెక్కింపు పూర్తవడంతో కొన్నిచోట్ల బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. గెలుపొటములు బ్యాలెట్ల ఓట్లపైనే ఆధారపడి ఉన్నాయి. దీంతో బ్యాలెట్ ఓట్లలో ఎవరు సత్తా చాటుతారనేది ఆసక్తిని రేపుతోంది. ఇక తొలి ఫలితం మెహదీ పట్నం నుంచి వెలువనుంది.

    మెహదీపట్నంలో కేవలం 11వేల ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ప్రతీ రౌండ్ కు 14వేల ఓట్లు లెక్కించాల్సి ఉంది. దీంతో తొలి రౌండ్లనే మోహదీపట్నం రిజల్ట్ రానుంది. దీంతో ఇక్కడి నుంచే తొలి విజేత ఎవరా? అనే ఆసక్తి మొదలైంది. ఈ స్థానంలో ఎంఐఎం వర్సెస్ బీజేపీ అన్నట్లు ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. అయితే చివరికీ మాత్రం ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ గెలుపొందారు.

    Also Read: గ్రేటర్ వార్.. హైకోర్టులో ఎస్ఈసీ లంచ్ మోషన్ పిటిషన్..!

    స్వస్తిక్ గుర్తు ఉన్న ఓట్లను మాత్రమే పరిగణించాలని హైకోర్టు ఎన్నికల కమిషన్ ను ఆదేశించడంతో ఓటింగ్ లెక్కింపు కొంచెం ఆలస్యమయ్యేలా కన్పిస్తోంది. తొలి ఫలితం ఉదయం 11గంటల వరకు వెలువడుతుందని అంచనా వేయగా చాలా ఆలస్యంగా వెలువడింది. 12గంట తర్వాత తొలి ఫలితం రావడం గమనార్హం.

    ఇక శివారు ప్రాంతాల్లో ఓటింగ్ శాతం గతంలో కంటే ఎక్కువగా పోలైనట్లు తెలుస్తోంది. పెరిగిన ఓటింగ్ శాతం టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటుందా? లేదా అనేది ఉత్కంఠను రేపుతోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తుది ఫలితాలు వచ్చే వరకు రాత్రి సమయం పట్టేలా కన్పిస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్