Suresh Raina : టీమిండియా మాజీ క్రికెటర్, ఐపీఎల్ స్టార్ ఆటగాడు సురేశ్‌రైనా అత్తామామల హత్యకేసు నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్.. ముజఫర్‌నగర్‌లోని షాపుర్‌లో శనివారం జరిగింది. అసలు రైనా అత్తామామలను ఎందుకు హత్యచేశాడు, నిందితుడికి ఎందుకు ఎన్‌కౌంటర్ చేశారన్న చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతోంది.
దొంగతనానికి వచ్చి దాడి..
2020, ఆగస్టు 19న పఠాన్‌కోట్‌లోని క్రికెటర్ సురేశ్‌రైనా అత్త, మామ ఇంట్లో రషీద్ చోరీకి పాల్పడ్డాడు. నిందితులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సురేశ్ రైనా మామ అశోక్‌కుమార్, అత్త ఆశా, బావమరిది కౌశల్ కుమార్‌ను రషీద్ తీవ్రంగా గాయపరిచాడు. అశోక్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆశా, కౌశల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఏడాది తర్వాత ఇద్దరి అరెస్ట్..
ఈ కేసులో ఇద్దరు నిందితులను గతేడాది సెప్టెంబరులో పోలీసులు పట్టుకున్నారు. కానీ వారే హత్య చేసినట్లు నిర్ధారణ కాలేదు. వారిని విచారించగా రషీద్ పేరు బయటకొచ్చింది. అప్పటికే రషీద్ పరారీలో ఉన్నాడు. అతని కోసం తీవ్రంగా గాలించినా దొరకలేదు. అయినా పోలీసుల వేట ఆగలేదు.
ఇన్‌ఫార్మర్ సమాచారంతో..
శనివారం కొందరు నేరస్థులు షాపుర్‌కు వచ్చినట్లు ఇన్‌ఫార్మర్ నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు, ఎస్‌వోజీ బృందం అప్రమత్తమైంది. సోరం–గోయ్లా రహదారిపై దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపగా నిందితుడు రషీద్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే షాపుర్‌లోని సీహెచ్‌సీకి తరలించాం. అప్పటికే నిందితుడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
దొంగతనానికి వచ్చి ముగ్గురి ప్రాణం తీసిన రషీద్ చివరకు పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్ కావడంతో పోలీసులు విసిగిపోయి, నిందితుడి కోసం గాలించి చివరకు చంపేసి ఉంటాడని భావిస్తున్నారు.