Homeఆంధ్రప్రదేశ్‌Mlc Driver: డ్రైవర్ ను హత్య చేసింది ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కరేనా?

Mlc Driver: డ్రైవర్ ను హత్య చేసింది ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కరేనా?

Mlc Driver: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య సంచలనం సృష్టిస్తోంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ తన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో పోలీసుల తీరుపై విమర్శలు వచ్చాయి. రాష్ర్టంలో శాంతిభద్రతలు ఉన్నాయా? లేక అధికార పార్టీకి వంత పాడుతున్నాయా అనే కోణంలో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అధికార పార్టీ వైసీపీకి కొమ్ము కాస్తూ సామాన్యుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని మండిపడుతున్నారు. ఎమ్మెల్సీ అరెస్టుపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Mlc Driver
Subrahmanyam

ఎమ్మెల్సీ అరెస్టుపై పెద్ద హైడ్రామా నడుస్తోంది. ఆయనను అరెస్టు చేశారని కొందరు అంటుంటే అలాంటిదేమీ లేదని ఇంకొందరు చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎమ్మెల్సీని అరెస్టు చేసి రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ హత్యపై ఎమ్మెల్సీ గొంతు విప్పినట్లు చెబుతున్నారు. డ్రైవర్ ను తానే హత్య చేసినట్లు ఎమ్మెల్సీ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎవరి ప్రమేయం లేదని, తానొక్కడినే చేసినట్లు వెల్లడించినట్లు సమాచారం.

Also Read: Shocking Twist: పెళ్లి ఆపాలని ప్రయత్నించి ప్రాణాలు కోల్పొయింది…. వధువు మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్

వ్యక్తిగత వ్యవహారాల్లో తలదూర్చినందుకే అతడిని అంతం చేసినట్లు చెప్పినట్లు తెలిసింది. వ్యక్తిగత విషయాల్లో బ్లాక్ మెయిల్ కు దిగినందు వల్లే సుబ్రహ్మణ్యంను చంపే వరకు వ్యవహారం వెళ్లిందని నిజం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎమ్మెల్సీ డ్రైవర్ ను హత్య చేసినట్లు చెప్పడంతో దానికి సంబంధించిన విషయాలు కూడా వెల్లడించాల్సి ఉంది. దీనిపై పోలీసులు మాత్రం మీడియాకు వెల్లడించడం లేదు. ఆయన అరెస్టుపై ఎక్కడ కూడా మాట ఎత్తడం లేదు.

Mlc Driver
Anantha Babu

ఇవాళ సాయంత్రం పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య గురించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎక్కడ హత్య చేశాడు? మృతదేహాన్ని ఎలా తరలించాడనే దానిపై అన్ని వివరాలు తెలిసే సూచనలున్నాయని చెబుతున్నారు. అసలు ఎందుకు హత్య చేశారు? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లకుండానే విచారణ చేపడుతున్నట్లు సమాచారం. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Also Read: Another Record In Ballayya Name: బాలయ్య పేరిట మరో అరుదైన రికార్డ్.. ఇండియాలోనే నెంబర్ వన్ హీరో..

Recommended Videos:

https://www.youtube.com/watch?v=iUtvpRtc5hE&t=11s

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular