Bindu Madhavi: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ షోలో ఎమోషనల్ రివెంజ్ డ్రామాలు, కంటెస్టెంట్ల మధ్య వింత వింత టాస్కులు.. ప్రేక్షకులకు మరింత కిక్ ను ఇచ్చాయి. కంటెస్టెంట్లు కూడా గెలవడానికి ఎవరికి వాళ్ళు శతవిధాల ప్రయత్నాలు చేశారు. అయితే, ‘ఆవకాయ బిర్యానీ తినిపిస్తా’.. అంటూ హౌస్ లోకి అడుగు పెట్టిన బిందు మాధవి.. మొత్తానికి టైటిల్ ఎగరేసుకుపోయింది.

అయితే, హౌస్ లో అషూ, బిందు మాధవి సిగరెట్ తాగారంటూ అనేక ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా అర్ధరాత్రి సిగరెట్లు మాయమవుతున్నాయంటూ నటరాజ్ మాస్టర్ పెద్ద రాద్దాంతమే చేశాడు. తాజాగా బిందుమాధవి ఫ్యాన్స్‌తో సోషల్ మీడియాలో సరదాగా చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా ‘నువ్వు స్మోకింగ్ చేశావని స్రవంతి.. అఖిల్ తో చెప్పింది. అది నిజమేనా? అని ఓ నెటిజన్ ఆమెను ప్రశ్నించాడు.
Also Read: Another Record In Ballayya Name: బాలయ్య పేరిట మరో అరుదైన రికార్డ్.. ఇండియాలోనే నెంబర్ వన్ హీరో..
దానికి బిందు మాధవి స్పందిస్తూ.. ‘నేను అస్సలు పొగ తాగను’ అంటూ క్లారిటీ ఇచ్చింది. తనకు అస్సలు స్మోకింగ్ అలవాటు లేదు అని, ఒకవేళ స్మోకింగ్ అలవాటు ఉండుంటే, ఓపెన్ గానే స్మోకింగ్ చేసేదాన్నని బిందు మాధవి ఓపెన్ గా చెప్పేసింది. ఏది ఏమైనా ఈ మదనపల్లి బ్యూటీ దగ్గర మ్యాటర్ ఉంది.

నలుగురు అనుకున్న దాని కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివింది బిందు. మొదటి నుంచే బాస్ నాన్ స్టాప్ టైటిల్ ఫేవరేట్‌గా దూసుకుపోయింది. హౌస్ లో ఫస్ట్ డే నుంచి చాలా మెచ్యూర్డ్ గేమ్ ఆడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాంతో బిందు మాధవి పై ఓట్ల వర్షం కురిసింది. బాగా సానుభూతి వర్కౌట్ అయ్యింది.
పైగా ఆమెకు ప్రతి విషయం పై ఫుల్ క్లారిటీ ఉంది. అసలు సమస్య ఏమిటి ? ఆ సమస్య ఎవరి కారణంగా వచ్చింది ? ఇప్పుడేం చేయాలి ? ఇలా చెప్పాల్సిన విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెబుతుంది భిందు మాధవి. ఆమె మాట్లాడే పాయింట్ టు పాయింట్ లో కావాల్సినంత మ్యాటర్ ఉంటుంది. ఆమె దెబ్బకు ఓ దశలో కంటెస్టెంట్స్ అందరూ ఒక్కటి అయిపోయేవారు. మొత్తమ్మీద ఆమెకున్న క్లారిటీనే ఆమెను విన్నర్ ను చేసింది.
Also Read: Mlc Anantha Babu: అనంతబాబు హత్య కేసు.. జగన్‌కు అగ్ని పరీక్ష!! నిష్పక్షపాత విచారణ జరిగేనా?
Recommended Videos:
https://www.youtube.com/watch?v=EdALqdIzBis
[…] […]