Homeఎంటర్టైన్మెంట్Another Record In Ballayya Name: బాలయ్య పేరిట మరో అరుదైన రికార్డ్.. ...

Another Record In Ballayya Name: బాలయ్య పేరిట మరో అరుదైన రికార్డ్.. ఇండియాలోనే నెంబర్ వన్ హీరో..

Another Record In Ballayya Name: నట సింహం నందమూరి బాలకృష్ణ గురించి కొత్తగా చెప్పడానికి ఏమి లేదు. బాలయ్య స్వభావం లాగే, ఆయన పర్సనల్ లైఫ్, అలాగే ఆయన సినీ కెరీర్ అంతా ఓపెన్ బుకే. బాలయ్యను దూరం నుంచి చూసిన వాళ్ళు, ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం అంటారు. దగ్గర నుంచి చూసిన వాళ్ళు, ఆయన మనసు స్వచ్ఛమైన వెన్న లాంటిది అంటారు. అయితే, రికార్డులును బ్రేక్ చేయడంలో బాలయ్య తర్వాతే ఎవరైనా.

Another Record In Ballayya Name
Balakrishna

అసలు ఆయన సినిమాలు సాధించిన రికార్డుల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. నటసింహం బాలకృష్ణ అఖండ మూవీతో బాక్సాఫీస్ పై దండయాత్ర చేశాడు. అఖండ విజయం సాధించిన నేపథ్యంలో బాలయ్య ఫ్యాన్స్ పండుగ జరుపుకున్నారు. అఖండ థియేటర్స్ వద్ద కోలాహలం నెలకొంది. కరోనా పరిస్థితుల తర్వాత థియేటర్స్ వద్ద ఈ స్థాయిలో జనాలను చూడలేదు.

Also Read: Akira Plays Piano For Mahesh Song: మహేష్ పాటకు… పియానో వాయించిన పవన్ వారసుడు ‘అకీరా’ !

బాలయ్య-బోయపాటి మూవీ కోసం సినిమా ప్రియులు, ఫ్యాన్స్ థియేటర్స్ కి పోటెత్తారు. ఈ రోజుల్లో ఒక సినిమా మూడు వారాలు ఆడిందంటే అది చరిత్ర. అలాంటిది బాలయ్య ‘అఖండ’ 5 ఏకంగా 175 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సినిమా 50వ రోజు 103 థియేటర్స్‌లో ప్రదర్శించారు ఇది కూడా రికార్డు అని చెప్పాలి.

Another Record In Ballayya Name
Akhanda

ఈ సినిమా 175 రోజులు పరుగును పూర్తి చేసుకుంది. అది కూడా గుంటూరు జిల్లా చిలకలూరి పేటలోని రామకృష్ణ థియేటర్‌లో. ప్రస్తుతం ఈ రికార్డు ఒక్క బాలయ్యకే సొంతం అయ్యింది. ఈ విషయంలో బాలయ్య ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా నిలిచాడు. అలాగే, ఈ సినిమా 20 థియేటర్స్‌లో 100 రోజుల పూర్తి చేసుకుంది. అందులో 4 కేంద్రాల్లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది. మొత్తానికి అఖండ థియేటర్స్ ఈలలు, గోలలతో దద్దరిల్లి పోయాయి.

మెయిన్ గా బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ కు, హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకులు ఊగిపోయారు. అటు ఓవర్ సీస్ లో అఖండ దుమ్మురేపింది. సాధారణంగా ఓవర్ సీస్ లో బాలయ్య సినిమాలకు పెద్దగా మార్కెట్ ఉండదు. ఇక్కడ భారీ హిట్స్ కొట్టిన చిత్రాలకు కూడా నామమాత్రపు వసూళ్లు దక్కుతాయి. అఖండ మూవీ మాత్రం భిన్నంగా విశేష ఆదరణ దక్కించుకుంది.

Also Read: Mlc Anantha Babu: అనంతబాబు హత్య కేసు.. జగన్‌కు అగ్ని పరీక్ష!! నిష్పక్షపాత విచారణ జరిగేనా?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular