Pawan Kalyan – Green Tax: విశాఖలో పవన్ వారాహి 3.0 యాత్ర జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ వైఫల్యాలు పై జనసేనాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా పవన్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. నేరుగా రిషికొండ ప్రాంతాన్ని సందర్శించి ప్రభుత్వ తప్పిదాలను పవన్ ఎండగట్టారు. అటు ప్రజలు సైతం స్వయంగా తమ సమస్యలను పవన్ కు చెప్పేందుకు ముందుకు వస్తున్నారు.ఓ లారీ డ్రైవర్ నేరుగా వచ్చి పవన్ కు తన గోడును వెళ్ళబోసుకున్నారు.జగన్ సర్కార్ వాహనాలపై విధిస్తున్న టాక్స్ను, ఇతర రాష్ట్రాలతో పోల్చుతూ చేస్తున్న దోపిడీని పవన్ కు కళ్ళకు కట్టినట్లు వివరించాడు.
ఏపీలో మోటార్ సైకిళ్లు,ఆటో రిక్షాలు మినహా అన్ని వాహనాలపై గ్రీన్ టాక్స్ విధిస్తున్నారు. 2021 నుంచే దీనిని అమలు చేస్తున్నారు. దీనికోసం స్లాబ్ విధానం అమల్లోకి తెచ్చారు. ఒక్కో స్లాబ్ కు రెట్టింపు వసూలు చేస్తున్నారు.రిజిస్ట్రేషన్ సమయం నుంచి పది సంవత్సరాలలోపు రవాణా వాహనాలు విషయంలో గ్రీన్ టాక్స్ రూ.4 వేలు. అదే వాహనం వయస్సు 10 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉంటే రూ.5 వేలు. 12 సంవత్సరాలకు మించితే రూ.6 వేలు. ఇక పన్నులు భారమైతే చెప్పనక్కర్లేదు. ఏకంగా 18 శాతం పన్ను విధిస్తోంది. అయితే లారీ డ్రైవర్ స్వయంగా ఈ విషయం చెప్పేసరికి పవన్ షాక్ కు గురయ్యారు.
తమిళనాడులో గ్రీన్ టాక్స్ 200 రూపాయలు ఉండగా, తెలంగాణలో 500 రూపాయలు ఉందని చెప్పుకొచ్చారు. ఏపీలో మాత్రం 6600 ఉందని చెప్పడంతో పవన్ షాక్ కి గురయ్యారు. ఈ విషయం తనకు తెలియదని.. తప్పకుండా ఈ అంశంపై ఫోకస్ చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే పవన్ కు ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు ముందుకు రావడం విశేషం. పవన్ ద్వారా అయితేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని వారు నమ్ముతున్నారు, అందుకే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. లారీ డ్రైవర్ చెప్పిన తర్వాత పవన్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం పన్నుల పేరిట జరుపుతున్న దోపిడీపై ధ్వజమెత్తారు.పవన్ ఇటువంటి ప్రజా సమస్యలపై ఫోకస్ పెడితే.. మంచి ఫలితాలు వస్తాయని.. ప్రజల్లో కూడా గ్రాఫ్ గణనీయంగా పెంచుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.