Guppedantha Manasu Jyothi Rai: సినిమాల కంటే ఇప్పుడు టీవీ సీరియళ్లు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. కొన్ని సీరియళ్లను మహిళలే కాకుండా పురుషులు క్రమం తప్పకుండా చూస్తున్నారు. దీంతో అలనాటి హీరో, హీరోయిన్లతో పాటు కొందరు కొత్తవారు సైతం బుల్లితెరపై కనిపించాలని ఆరాటపడుతున్నారు. సీరియళ్లలో నటించి గుర్తింపు తెచ్చుకున్నవాళ్లు సినిమా స్టార్ల కంటే పాపులర్ అవుతున్నారు. వీరికి ఫ్యాన్స్ కూడా ఉంటున్నారు. ఇలా బుల్లితెరపై ఓ హీరోకు తల్లిగా నటించి గుర్తింపు తెచ్చుకుంది ఓ నటి. ఈమె సీరియల్ లో ఏజ్ బార్ లా కనిపించినా రియల్ లైఫ్ లో మాత్రం అందాల తార అని తెలియగానే షాక్ అవుతున్నారు. ఆమెకు సంబంధించిన లేటేస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో చూసి నోరెళ్లబెడుతున్నారు.
మా టీవీలో వచ్చే ‘గుప్పెడంత మనసు’ అనే సీరియల్ బాగా ఫేమస్. ఇందులో హీరోకు తల్లిగా జగతి అనే పాత్రలో నటించి మెప్పిస్తోంది జ్యోతిరాయ్. ఈమెను సీరియల్ లో చూస్తే ఎంతో ఏజ్ బార్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఆమె నటనకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. పదేళ్ల కిందట కన్యాదానం అనే సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా జ్యోతిరాయ్.. ఈ సీరియల్ తో స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది.
జ్యోతిరాయ్ కన్నడ పరిశ్రమ నుంచి వచ్చారు. ఇప్పటి వరకు ఆమె కన్నడ, తుళు, తెలుగు భాషల్లో కలిపి 20కి పైగా సీరియల్స్ లో నటించారు. 15 వరకు సీరియల్స్ లో హీరోయిన్ గా అలరించింది. వీటిలో కస్తూరి నివాస్ సీరియల్ ఆమెకు గుర్తింపు తీసుకొచ్చింది. అయితే గుప్పెడంత మనసు సీరియల్ తో ఆమెకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగి సినీ స్టార్ లెవల్లో ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీసులో నటిస్తోంది. మరో కొన్ని ప్రాజెక్టులకు సైన్ చేసింది.
జ్యోతిరాయ్ పర్సనల్ లైఫ్ లోకి వెళ్తే ఆమె గతంలో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొన్ని రోజుల పాటు కలిసున్న వీరు ఆ తరువాత విడిపోయారు. ప్రస్తుతం ఆమె జ్యోతిరాయ్ వయసు 38 ఏళ్లు. ఇప్పుడు ఆమె డైరెక్టర్ సుకు పుర్వాజ్ తో డేటింగ్ చేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల కిందట ఆమె పేరు పక్కన ఆ డైరెక్టర్ పేరును చేర్చింది. దీంతో ఆయనతో కలిసి ఉండే అవకాశం ఉందని చాలా మంది చర్చలు పెడుతున్నారు. ఇదిలా ఉండగా ఆమె సీరియల్ లో ఎంతో పద్దతిగా కనిపించినా.. సోషల్ మీడియాలో మాత్రం హద్దు పద్దు లేకుండా గ్లామర్ షో చేస్తోంది.