Kaleshwaram Project: మొన్న మేడిగడ్డ.. నేడు అన్నారం.. కరిగిపోతున్న కేసీఆర్‌ కాళేశ్వరం కల!

పిల్లర్లు కుంగిన కుంగిన మేడిగడ్డ బ్యారేజీని ప్రభుత్వం, ఇంజినీర్లు ఖాళీ చేశారు. సుమారు 10 టీఎసీల నీటిని వదిలేశారు. మరమ్మతులపై మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు కేంద్రం పంపిన కమిటీ బ్యారేజీ కుంగుబాటును పరిశీలించి కేంద్రానికి నివేదిక సమర్పించింది.

Written By: Raj Shekar, Updated On : November 1, 2023 6:06 pm

Kaleshwaram Project

Follow us on

Kaleshwaram Project: ‘‘ఎనుకటికి ఓ పనిమంతుడు పందిరి వేస్తే.. కుక్క తోక తాకి కూలిపోయిందట’’ సామెత మోటుగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేనే పెద్ద పనిమంతుడిని, నాకంటే గొప్ప ఇంజినీర్‌ ఎవడూ లేడు.. అంటూ రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం పరిస్థితి కూడా ఈ సామెత తరహాలోనే ఉంది. మొన్న మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయి.. భారీ నష్టం జరిగింది. దీనిపై ఇప్పటి వరకూ నోరు మెదపలి గులాబీ బాస్‌.. ఎన్నికల ప్రచారంలో మాత్రం కరెంటు, నీళ్లు అంటూ పదే పదే చెబుతున్నారు. ఇక ముఖ్యమైన మంత్రి మేడిగడ్డ కుంగిన పది రోజులకు స్పందించారు. ‘‘వరదలు వస్తే కూలిపోతది.. అయితే ఏంది.. కాంట్రాక్టు సంస్థనే కడుతది.. ప్రజల మీద ఎలాంటి భారం పడదు’’ అని మేడిగడ్డ కుంగుబాటును సమర్థించుకున్నారు. గతేడాది వరలకు మోటార్లు మునిగినప్పుడు కూడా ఇదే చెప్పారు. ఇప్పుడు పిల్లర్లు కింగితే మళ్లీ అదే చెబుతున్నారు. ఇంతలో కాళేశ్వరంలో మరే బ్యోరేజీ పగిలిపోయిందన్న వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మేడిగడ్డ ఖాళీ..
పిల్లర్లు కుంగిన కుంగిన మేడిగడ్డ బ్యారేజీని ప్రభుత్వం, ఇంజినీర్లు ఖాళీ చేశారు. సుమారు 10 టీఎసీల నీటిని వదిలేశారు. మరమ్మతులపై మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు కేంద్రం పంపిన కమిటీ బ్యారేజీ కుంగుబాటును పరిశీలించి కేంద్రానికి నివేదిక సమర్పించింది. బ్యారేజీ భవిష్యత్‌ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

ఇప్పుడ అన్నారం వంతు..
ఒకవైపు మేడిగడ్డ కుంగిపోయి తీవ్ర నష్టం వాటిల్లగా, తాజాగా అన్నారం బ్యారేజీని బుంగపడినట్లు వార్తలు వస్తున్నాయి. బ్యారేజీ పిల్లర్లకు సమీపంలోనే పెద్ద బుంగపడి రిజర్వాయర్‌లోనీ నీళ్లన్నీ ఆ బుంగలోకి వెళ్తున్నాయి. దీంతో ఇప్పుడు అన్నారం బ్యారేజీ పిల్లర్లపై కూడా అనుమానాలు వ్యక్తముతున్నాయి. ఈ పిల్లర్లు కూడా ఉంటాయా, కుంగుతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కరిగిపోతున్న కాశేశ్వరం కల..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి తుమ్మిడి హెట్టివద్ద నిర్మించ తలపెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 2014లో అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌ మార్చేశారు. రీ డిజైన్‌ పేరుతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తెరపైకి తెచ్చారు. తన కలల ప్రాజెక్టు అని, కాళేశ్వరంతో లక్ష ఎకరాలు సాగులోకి వస్తుందని ప్రజలను నమ్మించారు. కేవలం మూడేళ్లలోనే హడావుడిగా అన్నీతానై నిర్మాణం పూర్తి చేయించారు. కానీ, ప్రారంభించిన మూడేళ్లకే మొన్న మేడిగడ్డ కుంగింది. నేడు అన్నారం అదే బాటలో ఉంది.. దీంతో కేసీఆర్‌ ఏ ప్రాజెక్టు అయితే తనను ఎన్నికల్లో గట్టెక్కిస్తుంది అనుకున్నారో ఇప్పుడు అదే స్వప్నం కరిగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో ఓటమికి అదే కారణమయ్యేలా కనిపిస్తోంది. మరి దీనిపై ముఖ్యమంత్రి, ముఖ్యమైన మంత్రి, ఆర్థిక మంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి.