రోజా.. ఈ పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండరేమో. ఫైర్ బ్రాండ్‌గా ముద్ర పడిన రోజా నోరు తెరిచిందంటే ప్రతిపక్షాలకు చుక్కలే. చాలాకాలం పాటు టీడీపీలో ఉన్న ఆమె.. తర్వాత జగన్ పార్టీకి చేరువయ్యారు. అప్పటి నుంచి చంద్రబాబు మీద ఏ స్థాయిలో విమర్శలు చేస్తోందో అందరికీ తెలుసు. అయితే.. జగన్ అధికారంలోకి వచ్చాక రోజాకు మంత్రి పదవి ఖాయమని అందరూ అనుకున్నారు. ఫస్ట్ విడతలో ఆమె మంత్రి సీటు వస్తుందని పొలిటికల్‌గానూ చర్చ జరిగింది. కానీ.. ఊహించని విధంగా జగన్ కేబినెట్‌లో రోజాను చేర్చుకోలేదు. అలా ఇవ్వకపోవడమే ఇప్పుడు మంచిది అయిందని అంటున్నారు ఆర్కే రోజా సన్నిహితులు, శ్రేయోభిలాషులు.
Also Read: రైతులకు మోదీ శుభవార్త.. మరో 5 వేలు రైతుల ఖాతాల్లో జమ..?
ఆర్కే రోజా నగరి నియోజకవర్గంలో రెండుసార్లు వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గాలి ముద్దు కృష్ణమనాయుడిపై నెగ్గిన రోజా, 2019 ఎన్నికల్లో మంచి మెజారిటీతో గాలి తనయుడు భాను ప్రకాష్ పై గెలుపొందారు. గాలి ముద్దు కృష్ణమ నాయుడు మరణంతో నగరి నియోజకవర్గంలో టీడీపీకి నేత అంటూ లేకుండా పోయారు. క్యాడర్ ను పట్టించుకునే వారు దిక్కులేరు. ఇది కాస్త ఆర్కే రోజాకు అడ్వాంటేజీగా మారింది. గాలి ముద్దు కృష్ణమనాయుడు వారసులు ఉన్నప్పటికీ వారికి రాజకీయాలు అచ్చిరాలేదు. గాలి ముద్దు కృష్ణమనాయుడు మరణంతో ఆ కుటుంబంలో రాజకీయ వారసత్వం కోసం విభేదాలు కూడా తలెత్తాయని అంటుంటారు. చివరకు చంద్రబాబు పంచాయితీ చేసి జగదీష్‌కు గత ఎన్నికల్లో సీటు ఇచ్చారు. అయినా రోజాపై ఓటమిపాలయ్యారు.
ఎన్నికల తర్వాత నుంచి జగదీష్ నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా పోయారు. ఆయన నియోజకవర్గంలో కంటే తిరుపతి, బెంగళూరులోనే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో ఆర్కే రోజా ఇప్పుడు టీడీపీ క్యాడర్‌కు వైసీపీ కండువాలు వేసే పనిలో పడ్డారు. ఇటీవలే 41 మంది టీడీపీ సానుభూతిపరులైన కుటుంబాలను ఆర్కే రోజా పార్టీలోకి తీసుకొచ్చారు.
Also Read: ప్రతిపక్షాలను డైవర్ట్ చేసేందుకేనా ఈ మంత్రుల కామెంట్స్
ఒకవేళ రోజాకు మంత్రి పదవి దక్కితే ఆమె రాష్ట్రం మొత్తం తిరిగే వారు. నియోజకవర్గం రాజకీయాలను పట్టించుకునే టైం కోల్పోయే అవకాశం ఉండేది. పార్టీ క్యాడర్ కూడా దెబ్బతినేది. ఎలాగూ మంత్రి పదవి రాకపోవడంతో ఇప్పుడు ఆమె పూర్తిగా టీడీపీ నాయకులను టార్గెట్ చేసింది. దొరికినోళ్లను దొరికినట్లుగా పిలిచి వారికి వైసీపీ కండువాలు కప్పుతోంది.