https://oktelugu.com/

PM Kisan Samman Yojana: రైతులకు కేంద్ర ప్రభుత్వం దసరా కానుక.. రూ. 2 వేలు అందించేందుకు రెడీ..

18వ విడత కింద రూ.2వేలు అందించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ మొత్తాన్ని యేసంగి ప్రారంభానికి ముందే అందించాలని నిర్ణయించింది. అంతేకాకుండా దసరా పండుగ నేపథ్యలంలో దీనిని అందించడం ద్వారా రైతులకు మరింత ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో దసరా కానుకగా రూ.2 వేలు అందించాలని నిర్ణియించింది. అయితే తాజాగా దీనిపై ఎలాంటి అప్డేట్ ఇచ్చిందంటే?

Written By:
  • Srinivas
  • , Updated On : October 3, 2024 / 07:33 PM IST

    PM Kisan Samman Yojana

    Follow us on

    PM Kisan Samman Yojana :  దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రతి ఏటా పెట్టుబడి సాయం కింద రూ.6000 సాయం చేస్తున్న విషయం తెలిసిందే. రైతులు తమ క్రాప్ లను ప్రారంభించే ముందు సాయంగా మూడు విడుతలుగా ఈ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఇప్పటి వరకు 17 విడతలుగా రూ. 2 వేల చొప్పున సాయం చేసింది. ఇప్పుడు 18వ విడత కింద రూ.2వేలు అందించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ మొత్తాన్ని యేసంగి ప్రారంభానికి ముందే అందించాలని నిర్ణయించింది. అంతేకాకుండా దసరా పండుగ నేపథ్యలంలో దీనిని అందించడం ద్వారా రైతులకు మరింత ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో దసరా కానుకగా రూ.2 వేలు అందించాలని నిర్ణియించింది. అయితే తాజాగా దీనిపై ఎలాంటి అప్డేట్ ఇచ్చిందంటే?

    రైతులకు పెట్టుబడి సాయం కింది కేంద్ర ప్రభుత్వం ‘కిసాన్ సమ్మాన్ యోజన’ కింద రూ.6 వేలు అందిస్తోంది. ఈ మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడుతలుగా అందించాలని నిర్ణయించింది. ప్రతీ విడతకు రూ.2 వేల చొప్పున అందిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు వానకాలం పంట కోతలు పూర్తి కాకముందే సాయం అందించనున్నారు. ఈ మేరకు తాజాగా అధికారికంగా ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు. అయితే పీఎం కిసాన్ సమ్మాన్ యోజన డబ్బులు పొందాలంటే రైతులు ఈ కేవైసీ పూర్తి చేయాలని తెలిపారు.

    ఇప్పటికే చాలా మంది రైతులు ఈ కైవేసీ పూర్తి చేయకపోవడంతో ఈ పథకానికి సంబంధించిన డబ్బులు పొందడం లేదు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని కోరుతున్నారు. ఈ కైవైసీ పూర్తి చేయాలనుకునేవారు ఆన్ లైన్ లో లేదా మీ సేవ కార్యాలయంలో అప్డేట్ చేసుకోవాలని అన్నారు. లేదా సంబంధిత మండల వ్యవసాయ అధికారిని సంప్రదించినా ఈ ప్రక్రియ పూర్తి చేస్తారని తెలిపారు. కొంత మంది కొత్తగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన వారు సైతం తమ పాస్ బుక్ లను అప్డేట్ చేసుకోవాలని అన్నారు.

    2019లో ప్రారంభించిన ఈ పథకం కింద ఇప్పటి వరకు 17 విడుతలుగా అందించిన ప్రభుత్వం ఇప్పుడు 18వ విడత కింద ఈ డబ్బులు అందజేయనుంది. సాగుభూమి కలిగిన రైతు కుటుంబాలు ఈ ప్రయోజనం పొందవచ్చు. ముందుగా నమోదు చేసుకున్న తరువాత సంబంధిత మొబైల్ కు అధికారిక వెబ్ సైట్ నుంచి మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ వచ్చిన తరువాత పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి అర్హులైనట్లే. ఆ తరుావత ప్రతీ విడతలో రూ.2 వేలు అందుతూ ఉంటాయి. తెలంగాణలో పీఎం కిసాన్ రైతు సమ్మాన్ యోజనతో పాటు రైతు బంధు పథకం కూడా ఉంది. ఈ పథకం కిద ప్రతీ ఏటా ఎకరాకు రూ.10 వేల సాయం అందించనున్నారు. అయితే ఈ పథకం కుటంబంతో సంబంధం లేకుండా భూముల ప్రకారంగా సాయం చేస్తారు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన మాత్రం వ్యక్తికి ఎంత వ్యవసాయ భూమి ఉన్నా రూ. 6 వేల సాయం మాత్రమే చేస్తారు. ఇది ఒక కుటుంబానికి మాత్రమే వర్తిస్తుంది.