Vettiyan Movie Team :  తెలుగు సినిమా అంటే రజినీకాంత్ ‘వెట్టియాన్’ మూవీ టీం కి అంత చులకన ఎందుకు? మరీ ఇంత దారుణమా!

తెలుగు ఆడియన్స్ కి 'వెట్టియాన్' అనే టైటిల్ కి అర్థం తెలియక తికమక పడుతున్నారు. 'వెట్టియాన్' అంటే తెలుగు లో 'వేటగాడు' అని అర్థం. మరి టైటిల్ అదే పెట్టొచ్చు కదా, ఎందుకు తమిళ టైటిల్ ని తెలుగులో కూడా పెట్టారు అని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు.

Written By: Vicky, Updated On : October 3, 2024 7:48 pm

Vettiyan Movie Team

Follow us on

Vettiyan Movie Team :  సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘వెట్టియాన్’. ఈ నెల 10 వ తారీఖున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ‘జై భీం’ ఫేమ్ జ్ఞాన్ వేల్ రాజా దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రజనీకాంత్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించబోతున్నాడని ట్రైలర్ ని చూసినప్పుడే అందరికీ అర్థం అయ్యింది. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటుగా అమితాబ్ బచ్చన్ , దగ్గుబాటి రానా, ఫహద్ ఫాజిల్ వంటి టాప్ స్టార్స్ కూడా నటించారు. అయితే తెలుగు ఆడియన్స్ కి ‘వెట్టియాన్’ అనే టైటిల్ కి అర్థం తెలియక తికమక పడుతున్నారు. ‘వెట్టియాన్’ అంటే తెలుగు లో ‘వేటగాడు’ అని అర్థం. మరి టైటిల్ అదే పెట్టొచ్చు కదా, ఎందుకు తమిళ టైటిల్ ని తెలుగులో కూడా పెట్టారు అని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ కి మన తెలుగు లో మన హీరోలతో సమానమైన మార్కెట్ ఉంటుంది. ఆయన గత చిత్రం ‘లాల్ సలాం’ పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ, అంతకు ముందు విడుదలైన ‘జైలర్’ చిత్రం కేవలం తెలుగు వెర్షన్ నుండి వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇంతటి అభిమానం ఆయన సినిమాలకు మన తెలుగు ఆడియన్స్ చూపిస్తున్నప్పుడు, రజినీకాంత్ కి ఆయన సినిమా టీం కి తెలుగు ఆడియన్స్ మీద గౌరవం చూపించాల్సిన అవసరం ఉంది. కానీ తమిళ టైటిల్ ని తెలుగు దబ్ వెర్షన్ కి కూడా పెట్టి ఆ మూవీ టీంకి మన ఆడియన్స్ మీద ఎంత ప్రేమ ఉందో చెప్పకనే చెప్పారు. తమిళ హీరోలలో ఒక సూర్య, కార్తీ తప్ప ఏ హీరో కూడా ఇక్కడికి వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ లు ఏర్పాటు చేయరు. కనీసం ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టరు.

అయినప్పటికీ వీళ్ళ సినిమాలు బాగుంటే మన తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టేస్తారు. ఇదే బహుశా తమిళ హీరోలలో ధైర్యం నింపిందేమో. అందుకే మన తెలుగు భాషకు గౌరవం ఇవ్వకుండా తమిళ టైటిల్ ని తెలుగు వెర్షన్ కి కూడా పెట్టేసారు. కుర్ర హీరోలు ఇలా చేసినా ఒక అర్థం ఉంది, సూపర్ రజినీకాంత్ కి దశాబ్దాల నుండి మన తెలుగు సినీ పరిశ్రమలో క్రేజ్ ఉంది. అయినప్పటికీ కూడా ఆయన ఇలాంటివి చూసి చూడనట్టు వదిలేస్తున్నాడంటే, తెలుగు ఆడియన్స్ ఎలా ఉన్నా ఆదరిస్తారు అనే నమ్మకమే కదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే విధంగా మన తెలుగు స్టార్ హీరో, తెలుగు టైటిల్ తోనే తమిళం లో దబ్ చేస్తే తమిళ ఆడియన్స్ ఊరుకుంటారా?, ఎందుకు తెలుగు ఆడియన్స్ అంత చులకన అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు.