ఆస్తమాతో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో సమస్యకు చెక్..?

ప్రపంచ దేశాల్లోని జనాభాలో చాలామంది ఆస్తమాతో బాధ పడుతున్నారు. చల్లటి వాతావరణంలో ఆస్తమా రోగులు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. జన్యులోపం వల్ల, వివిధ కారణాల వల్ల చాలామంది ఆస్తమా బారిన పడుతున్నారు. ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్లే సమయంలో మ్యూకస్ ముంబెన్ బ్రాంకైల్ మ్యుకోస్ పొరకు ఏమైనా ఇబ్బందులు కలిగితే ఆస్తమా బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఆస్తమా రోగులు వాతావరణంలో చిన్నచిన్న మార్పులు వచ్చినా ఇబ్బందులు పడుతూ ఉంటారు. Also Read: దేశ ప్రజలకు శుభవార్త.. […]

Written By: Kusuma Aggunna, Updated On : November 3, 2020 8:15 pm
Follow us on


ప్రపంచ దేశాల్లోని జనాభాలో చాలామంది ఆస్తమాతో బాధ పడుతున్నారు. చల్లటి వాతావరణంలో ఆస్తమా రోగులు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. జన్యులోపం వల్ల, వివిధ కారణాల వల్ల చాలామంది ఆస్తమా బారిన పడుతున్నారు. ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్లే సమయంలో మ్యూకస్ ముంబెన్ బ్రాంకైల్ మ్యుకోస్ పొరకు ఏమైనా ఇబ్బందులు కలిగితే ఆస్తమా బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఆస్తమా రోగులు వాతావరణంలో చిన్నచిన్న మార్పులు వచ్చినా ఇబ్బందులు పడుతూ ఉంటారు.

Also Read: దేశ ప్రజలకు శుభవార్త.. నిమిషాల్లో కరోనా రిపోర్ట్ చెప్పే యాప్ రెడీ!

ఆస్తమాతో బాధ పడేవారికి శ్వాసకోశ మార్గం మూసుకుపోవడం, శ్వాసకోశంలో వాపు రావడం లాంటి సమస్యలు ఏర్పడతాయి. ఆస్తమాతో బాధ పడేవారిలో దగ్గు, ఆయాసం, శ్వాస సంబంధిత సమస్యలు కనిపిస్తాయి. ఎలర్జీ కారకాలు, వైరల్ ఇన్ఫెక్షన్, కెమికల్స్, ఎలర్జీ కారకాలు, పొగ, దుమ్ము, ధూళి ఈ సమస్యలకు కారణమవుతున్నాయి. మారుతున్న కాలంతో పాటే ఆస్తమాకు ఎన్నో మందులు, వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి.

ఆస్తమాతో బాధ పడేవాళ్లు పొగ, దుమ్ము, ధూళి, చల్లటి వాతావరణానికి దూరంగా ఉండాలి. బెడ్ షీట్స్ , బ్లాంకెట్స్ పొడిగా ఉండేలా చూసుకోవడంతో పాటు నెలకొకసారైనా ఉతకాలి. రోజూ మెడిటేషన్, యోగా చేయడం ద్వారా కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. వాతావరణంలో ఎక్కువ తేమ ఉంటే ముఖానికి మాస్క్ కట్టుకుని ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. ఆస్తమాను హోమియో చికిత్స ద్వారా సులువుగా తగ్గించుకునే అవకాశం ఉంది.

Also Read: కరోనాలో మరో కొత్త లక్షణం.. నిమిషాల్లో చంపేస్తుందట..?

నేట్రం సల్ఫ్, అరేలియా, కార్బొలేజ్, సాబుకస్, ఆర్సెనిక్ అల్బ్, ఆంటిమెనిమ్ ఆర్స్ లాంటి మందులు ఈ వ్యాధిని నివారించడంలో సహాయపడతాయి. ఈ మందుల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.