Homeజాతీయ వార్తలుMinister Rammohan Naidu : విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్న వేళ.. కేంద్రం సరికొత్త నిర్ణయం..

Minister Rammohan Naidu : విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్న వేళ.. కేంద్రం సరికొత్త నిర్ణయం..

Minister Rammohan Naidu :  గత కొద్దిరోజులుగా అంతర్జాతీయ, దేశీయ విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇటువంటి కాల్స్ రావడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ పరిణామం గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. విమానాల రాకపోకలకు సంబంధించి బెదిరింపులకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో చట్టాలను మార్చడానికి సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతోంది. ఇదే విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. “సంఘవిద్రోహ శక్తులు చేసే పని వల్ల ప్రయాణికుల విలువైన సమయం వృధా అవుతోంది. వారికి సౌకర్యాలు కల్పించడం విమానయాన సంస్థలకు ఇబ్బందికరంగా మారుతోంది. అందువల్లే కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఏర్పడుతోందని” రామానాయుడు వ్యాఖ్యానించారు.

చట్టాలను సవరించే అవకాశం..

దేశ వ్యాప్తంగా పలు విమానశ్రాయాల నుంచి వందల కొద్ది విమానాలు అంతర్జాతీయంగా, జాతీయంగా రాకపోకలు సాగిస్తాయి. వీటిల్లో కొన్ని విమానాలకు పదుల సంఖ్యలో బాంబు హెచ్చరికలు వస్తున్నాయి. దీనివల్ల విమానయాన సంస్థలు ఇబ్బంది పడుతున్నాయి. ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. అయితే ఈ బెదిరింపులు ఎవరు చేస్తున్నారు? అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనే విషయాలను కనుక్కోవడం అధికారులకు తీరా ఇబ్బందిగా మారింది. అయితే ఇప్పటివరకు వచ్చిన బెదిరింపు కాల్స్ మొత్తం ఫేక్ అని తెలుస్తోంది. ఇదే విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఇలాంటి బెదిరింపులకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ” విమానయాన శాఖకు కఠినమైన ప్రోటోకాల్ ఉంది. విమానాలకు బెదిరింపులు వచ్చినపుడు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ విధి విధానాలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది.. విమానాల రాకపోకలకు ఆటంకం కలిగించి.. బూటకపు ఫోన్ కాల్స్ చేసే వ్యక్తులు భవిష్యత్తులో ఫ్లైట్ లలో జర్నీ చేయకుండా జీవితకాలం నిషేధం విధించే నిర్ణయాన్ని తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని” రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు.

తెరపైకి 1982 సేఫ్టీ యాక్ట్

అక్టోబర్ 14 నుంచి ఇప్పటివరకు సుమారు 100 విమానాలకు ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి.. ఇప్పటికే కేంద్రమంత్రి సంబంధిత అధికారులతో ఈ వ్యవహారంపై చర్చలు జరిపారు. విమానయాన భద్రతా నిబంధనలను సవరించే అవకాశాన్ని ఆయన పరిశీలిస్తున్నారు. 1982 సేఫ్టీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చట్టాన్ని సవరించేందుకు పౌర విమానా శాఖ సహాయ మంత్రి రామ్మోహన్ నాయుడు చర్చలు జరుపుతున్నారు. అయితే ఇది ఫేక్ కాల్స్ అయినప్పటికీ.. ప్రయాణికుల భద్రత, క్షణ విషయంలో రాజీ పడబోమని రామానాయుడు చెబుతున్నారు.. శనివారం 30కి పైగా అభిమానులకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చా. ఆదివారం కూడా మరో 24 విమానాలకు అలాంటి కాల్స్ వచ్చాయి. విస్తారా, ఆకాశ ఎయిర్, ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలకు ఇటువంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular