https://oktelugu.com/

సైన్యానికి కేంద్రం ‘స్మార్ట్‌’ సేవ

బార్డర్‌‌లో రక్షణగా ఉన్న సైనికుల బాగు కోసం ముందు నుంచీ భారత్‌ చర్యలు తీసుకుంటూనే ఉంది. ఎముకలు కొరికే చలిలోనూ.. మంచుకొండల మధ్య దేశాన్ని కాపాడుకుంటూ రక్షణగా నిలుస్తున్నారు మన సైనికులు. అందుకే.. చైనాకు దీటుగా ఈసారి కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది. సైన్యానికి కావాల్సిన స్మార్ట్‌ టెంట్లను అందించింది. Also Read: ట్రంప్‌ మరో భారీ కుట్ర గతంలో ఎప్పుడూ లేనివిధంగా సోలార్ పవర్‌‌తో పనిచేసే టెంట్లను సమకూర్చింది. తూర్పు లడ్డాఖ్‌తో పాటు వాస్తవాధీన రేఖ వెంబడే […]

Written By:
  • NARESH
  • , Updated On : November 21, 2020 / 02:57 PM IST
    Follow us on

    బార్డర్‌‌లో రక్షణగా ఉన్న సైనికుల బాగు కోసం ముందు నుంచీ భారత్‌ చర్యలు తీసుకుంటూనే ఉంది. ఎముకలు కొరికే చలిలోనూ.. మంచుకొండల మధ్య దేశాన్ని కాపాడుకుంటూ రక్షణగా నిలుస్తున్నారు మన సైనికులు. అందుకే.. చైనాకు దీటుగా ఈసారి కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది. సైన్యానికి కావాల్సిన స్మార్ట్‌ టెంట్లను అందించింది.

    Also Read: ట్రంప్‌ మరో భారీ కుట్ర

    గతంలో ఎప్పుడూ లేనివిధంగా సోలార్ పవర్‌‌తో పనిచేసే టెంట్లను సమకూర్చింది. తూర్పు లడ్డాఖ్‌తో పాటు వాస్తవాధీన రేఖ వెంబడే మన సరిహద్దుల్లో వేలాది మంది సైనికులు 24 గంటలు తమ ప్రాణాలను పణంగా పెట్టి కాపలా కాస్తున్నారు. ఎంత అప్రమత్తంగా ఉంటున్నా ఒకవైపు చైనా సైనికులు మరోవైపు దాయాది దేశం పాకిస్తాన్ సైన్యంతోపాటు ఉగ్రవాదులు కూడా మనదేశంలోకి చొరబడుతున్నారు. అవసరం లేకపోయినా రెండు దేశాల సైనికులు కాల్పులు జరుపుతున్నారు.

    అయితే.. సరిహద్దుల్లో అసలైన సమస్య ఇప్పుడు మొదలైంది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు లడ్డాఖ్ ప్రాంతంలో విపరీతమైన మంచు కురుస్తుంది. హియాలయ పర్వత ప్రాంతాలతోపాటు మంచులోయల్లో కూడా మన సైన్యం కాపలా కాయాల్సి ఉంటుంది. నవంబర్ నుంచి జనవరి మద్యలో ఈ ప్రాంతంలో చలి మైనస్ 40 డిగ్రీల వరకు నమోదవ్వటం ఇక్కడ చాలా సహజం. ఇంత చలిలో విధులు నిర్వర్తించాలంటే ఎవరికి కూడా సాధ్యం కాదు. ఇటువంటి వాతావరణాన్ని తట్టుకునేందుకు చైనా సైన్యం సోలార్ పవర్‌‌తో పనిచేసే టెంట్లను తన సైన్యానికి అక్టోబర్‌‌లోనే అందించింది. అయితే.. ఇంతకుముందు మన ప్రభుత్వం ఇటువంటి టెంట్లను అందించటానికే ప్లాన్ చేసినా ఆలస్యమైంది.

    Also Read: కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌లు

    మొత్తానికి నవంబర్ మొదటి వారంలో సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైన్యానికి వందల సంఖ్యలో టెంట్లను కేంద్రం అందించింది. టెంటు లోపల సోలార్ పవర్ వల్ల విద్యుత్ 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది. సైనికులు పడుకునే పరుపులు.. తాగే నీరు.. టెంటు లోపల విద్యుత్ హీటర్ల వల్ల వెచ్చగా ఉంటుంది. చివరకు ఆయుధాలు పెట్టుకునే లాకర్లు.. బట్టలు పెట్టుకునే కబ్బోర్డులు కూడా టెంట్లలో వెచ్చగానే ఉంటాయి. ఆయుధాలపై మంచు పేరుకుపోకుండా ప్రత్యేకమైన పాలిష్టర్ పొరను సైన్యానికి అందించింది. ఈ ప్రత్యేక టెంట్ల కారణంగా తినే ఆహారాన్ని కూడా అవసరానికి తగ్గట్లు వేడి చేసుకోవచ్చు. ఇప్పటివరకు చలికాలం వస్తోందంటే మన సైన్యం నానా అవస్తలు పడేది. అలాంటిది ఇక నుండి చలిపులిని చూసి భయపడాల్సిన అవసరం లేదు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్