
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంనకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. కాగా స్పీకర్ కారు పాక్షికంగా దెబ్బతింది. శ్రీకాకుళం జిల్లా వాకలవలస, వంజంగి గ్రామాల మధ్య స్పీకర్ వెళ్తుండగా పాలకొండ రోడ్డులో ఓ ఆటో మధ్యలో నుంచి వచ్చింది. దీంతో ఆటోను తప్పటించబోయిన స్పీకర్ కారు పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో ఆటోడ్రైవర్ కు గాయాలయ్యయి. అలాగే ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు కూడా గాయాలయ్యాయి. వెంటనే స్పీకర్ కారులో నుంచి దిగి గాయపడ్డవారిని శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు.