Nagarjuna Revanth Reddy: ఈ ఏడాది ప్రారంభం లో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) మరియు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య చాలా పెద్ద యుద్ధమే నడిచింది. అక్రమ కట్టడాలను కూల్చివేదం కోసం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తలపెట్టిన కార్యక్రమం లో భాగంగా హైడ్రా నాగార్జున N కన్వెన్షన్ హాల్ ని కూల్చివేయడం పెద్ద సంచలన టాపిక్ గా నిల్చింది. నాగార్జున ఈ అంశంపై పోరాడుతూ హై కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ నాగార్జున పై, ఆయన కుటుంబం పై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిందో మనమంతా చూసాము. ఈ విషయం లో నాగార్జున తో పాటు అక్కినేని ఫ్యామిలీ కూడా చాలా తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవ్వడమే కాకుండా, నాంపల్లి హై కోర్టులో నాగార్జున పరువు నష్టం దావా కూడా వేయాల్సి వచ్చింది. దీనిపై చాలా రోజుల పాటు కేసు నడిచింది.
చివరికి కొండా సురేఖ ఒక మెట్టు దిగి నాగార్జున కి క్షమాపణలు చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం తో నాగార్జున తానూ వేసిన పరువు నష్టం దావా కేసు ని కూడా వెనక్కి తీసుకున్నాడు. అయితే కొండా సురేఖ అలా వెనక్కి తగ్గడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవడమే కారణం అనే వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. నాగార్జున, సీఎం రేవంత్ రెడ్డి మధ్య కొన్ని విషయాల్లో పరస్పర ఒప్పందాలు జరిగాయని, అందుకే భద్ర శత్రువులుగా మారుతారు అని అనుకున్న వీళ్లిద్దరు, స్నేహితులు గా మారిపోయారని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే త్వరలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించబోతున్నా ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ కోసం ఏర్పాటు చేయనున్న స్టాళ్ళను సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి నాగార్జున కూడా పరిశీలించడం ఇప్పుడు సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు పెద్ద చర్చలకు దారి తీసింది.
ఈ కార్యక్రమం ఫ్యూచర్ సిటీ లో జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘మా అన్నపూర్ణ స్టూడియోస్ ని త్వరలోనే ఫ్యూచర్ సిటీ కి తీసుకొస్తాను. ఈ సమ్మిట్ లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి విజన్ డాక్యుమెంట్ ని చదివాను, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడే ఫిలిం హబ్ ని కూడా తయారు చెయ్యాలని చర్చలు జరుగుతున్నాయి’ అని చెప్పుకొచ్చాడు. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ ని ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ లో నిర్మిస్తారా?, లేదా బంజారా హిల్స్ లో ఉన్నటువంటి అన్నపూర్ణ స్టూడియోస్ ని పూర్తిగా క్లోజ్ చేసి ఫ్యూచర్ సిటీ కి తరలిస్తారా అనేది తెలియాల్సి ఉంది.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో స్టాళ్ల పరిశీలన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో హీరో నాగార్జున#Nagarjuna #RevanthReddy pic.twitter.com/eXLFjAohTo
— Telugu360 (@Telugu360) December 8, 2025