Ram Charan IndiGo issue: మెగా పవర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న నటుడు రామ్ చరణ్… చిరంజీవి కొడుకుగా కి ఎంట్రీ ఇచ్చినా కూడా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా అవతరించాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కారణం ఏదైనా కూడా ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ కొంతవరకు వెనకబడిపోయాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…
ఆచార్య సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన ఆయన ఆ సినిమాతో డీలా పడిపోయాడు. ఇక ఆ తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ సినిమా సైతం అతనికి ఆశించిన విజయాన్ని సాధించి పెట్టలేదు. కాబట్టి పెద్ది సినిమా ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది…
ఇక ఈ సినిమా షూటింగ్ సైతం 80% కంప్లీట్ అయింది. షూటింగ్ అవుట్ డోర్ లో ఉంది. ఇక షూటింగ్ నిమిత్తం ఆయన వేరే స్టేట్ కి వెళ్లాల్సిన క్రమంలో ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్ అయిన క్రమంలో ఆయన షూట్ కి హాజరు కాలేకపోయాడు. తద్వారా షూటింగ్ క్యాన్సిల్ అయింది… పైలెట్ షార్టెజ్ ఉండడంతో ఇండిగో ఫ్లైట్ తాత్కాలికంగా క్యాన్సిల్ అయింది. తద్వారా చాలామందికి చాలా ఇబ్బందులైతే ఎదురవుతున్నాయి. అందులో రామ్ చరణ్ కూడా ఒకరు కావడం విశేషం.
ఇక ఈ షెడ్యూల్ కి సంబంధించిన నెక్స్ట్ షూట్ ని మళ్లీ ఎప్పుడు చేస్తారు అనే దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది…ఇక మొత్తానికైతే బుచ్చిబాబు మరో రెండు నెలల్లో ఈ సినిమాని కంప్లీట్ చేసి మార్చి 26 న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. బుచ్చిబాబు అనుకున్నట్టుగానే ఈ సినిమాతో రామ్ చరణ్ కి సక్సెస్ ఇస్తాడా? అలాగే అభిమానులకు తను ఇచ్చిన మాట నిలుపుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…