https://oktelugu.com/

7th Pay Commission: విద్యా భత్యం, హాస్టల్‌ రాయితీలపై కేంద్రం కీలక నిర్ణయం

వేతన సవరణను అనుసరించి ఉదోఓయగులకు 50 శాతం డీఏ పెరిగినప్పుడల్లా పిల్లల విద్యా భత్యం, హాస్టల్‌ రాయితీ 25 శాతం పెరుగనుందిచ ఆ ప్రకారం వాస్తవ వ్యయంతో సబంధం లేకుండా విద్యాభత్యాన్ని రూ.2,812.50గా హాస్టల్‌ రాయితీని 8,437.50 చొప్పున స్థిరంగా అందిస్తుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 30, 2024 / 11:38 AM IST

    7th Pay Commission

    Follow us on

    7th Pay Commission: కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు అందించే విద్యా భత్యం, హాస్టల్‌ రాయితీల పరిమితులను కేంద్రం సోమవారం(ఏప్రిల్‌ 29న) సవరించింది. కరువు భ్యతం పెరిగిన 2021, జనవరి 1 నుంచి ఈ సవరణ అమలులోకి వచ్చింది.

    వేతన సవరణతో సంబంధం లేకుండా..
    వేతన సవరణను అనుసరించి ఉదోఓయగులకు 50 శాతం డీఏ పెరిగినప్పుడల్లా పిల్లల విద్యా భత్యం, హాస్టల్‌ రాయితీ 25 శాతం పెరుగనుందిచ ఆ ప్రకారం వాస్తవ వ్యయంతో సబంధం లేకుండా విద్యాభత్యాన్ని రూ.2,812.50గా హాస్టల్‌ రాయితీని 8,437.50 చొప్పున స్థిరంగా అందిస్తుంది.

    దివ్యాంగ పిల్లలకు..
    ఇక దివ్యాంగ పిల్లలు కలిగిన మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా భత్యం రూ.3,750 చెల్లిస్తారు. ఈమేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ వెల్లడించింది.

    12వ తరగతి వరకు..
    12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. సంస్థ లేదా పాఠశాల విదేశీ ఉన్నత విద్యా సౌకర్యాలు లేదా విశ్వవిద్యాలయాలతో అనుబంధించబడినప్పటికీ అందుబాటులో ఉంటుంది. సూర్తి సమయం కోర్సులు మాత్రమే ఈ మినహాయింపులకు అర్హులు. ప్రస్తుతం నిబంధనల ప్రకారం పార్ట్‌ ఐం విద్యా కోర్సులకు అనుతించబడవు. ఈ మినహాయింపులకు సింగిల్‌ పేరెంట్‌ కూడా క్లెయిమ్‌ చేయవచ్చు. అలాగే ఒక జంట బిడ్డను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంటే వారు ఈపన్ను ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.