TS SSC Results: పదో తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం(ఏప్రిల్ 30న) విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. రికార్డు స్థాయిలో ఈసారి 91.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో ఎప్పటిలాగే బాలికలు పైచేయి సాధించారు. బాలురు 89. 42 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణత సాధించారు.
నిర్మల్ ఫస్ట్..
ఫలితాల్లో నిర్మల్ జిల్లా 99.09 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా, రంగారెడ్డి, సిరిసిల్ల జిల్లాలు రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. వికారాబాద్ జిల్లా 65.01 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. నిర్మల్ మొదటి స్థానంలో నిలవడం ఇది వరుసగా రెండో ఏడాది. ఇక ఫెయిల్ అయిన, తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు 15 రోజుల సమయం ఇచ్చారు. రీకౌంటింగ్‌కు రూ.500, రీ వెరిఫికేషన్‌కు రూ.1000 ఫీజు నిర్ణయించారు. 8,883 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారు. 3,927 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఆరు పాఠశాలల్లో సున్నా రిజల్ట్ వచ్చింది. గతేడాది పదో తరగతిలో 89.60 శాతం ఉత్తీర్ణత రాగా, ఈసారి 91,31 శాతానికి పెరగింది.
జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు..
ఇక అవ్డాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13 వరకు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.
మార్చిలో పరీక్షలు..
ఈసారి పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగాయి. వీటికి 5,08,385 మంది హాజరయ్యారు. వరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. ఫలితాల్లో 4,91,862 మంది ఉత్తీర్ణత సాధించారు.