https://oktelugu.com/

ట్విట్టర్ కు షాకిచ్చిన కేంద్రం

కొద్దిరోజులుగా దేశంలో ట్విట్టర్ కు, కేంద్రప్రభుత్వానికి మధ్య వార్ నడుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా ట్విట్టర్ లో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల వాడి ఎక్కువవడం.. వాటిని విస్తృతంగా ప్రచారం చేస్తోందన్న ట్విట్టర్ తీరుపై కేంద్రం గుర్రుగా ఉంది. దేశంలో బాధ్యులను నియమించకుండా.. కేంద్రప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని ట్విట్టర్ పై కేంద్రం ఆగ్రహంగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా కొరఢ ఝలిపించింది. కేంద్రప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఐటీ నిబంధనల అమలుపై ట్విట్టర్ కు సమన్లు జారీ చేసింది కేంద్రం. […]

Written By:
  • NARESH
  • , Updated On : June 15, 2021 / 02:03 PM IST
    Follow us on

    కొద్దిరోజులుగా దేశంలో ట్విట్టర్ కు, కేంద్రప్రభుత్వానికి మధ్య వార్ నడుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా ట్విట్టర్ లో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల వాడి ఎక్కువవడం.. వాటిని విస్తృతంగా ప్రచారం చేస్తోందన్న ట్విట్టర్ తీరుపై కేంద్రం గుర్రుగా ఉంది. దేశంలో బాధ్యులను నియమించకుండా.. కేంద్రప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని ట్విట్టర్ పై కేంద్రం ఆగ్రహంగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా కొరఢ ఝలిపించింది.

    కేంద్రప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఐటీ నిబంధనల అమలుపై ట్విట్టర్ కు సమన్లు జారీ చేసింది కేంద్రం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తాజాగా షాక్ ఇచ్చింది. పార్లమెంట్ కాంప్లెక్స్ లో జూన్ 18వ తేదీన సాయంత్రం 4 గంటలకు జరిగే విచారణకు హాజరు కావాలని పేర్కొంది.

    సోషల్ మీడియా, ఆన్ లైన్ వార్తా సమాచార దుర్వినియోగాన్ని ఎలా అడ్డుకోవాలన్న అంశంపై ట్విట్టర్ ప్రతినిధి ప్రణాళికతో రావాలని కమిటీ తెలిపింది.

    సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అడ్డుకొని డిజిటల్ స్పేస్ లో మహిళల భద్రతకు రక్షణ కల్పించే అంశంపై ట్విటర్ ప్రతినిధి ఉద్దేశాలను తెలుసుకుంటాం అని పార్లమెంటరీ కమిటీ అజెండా పేర్కొంది.

    ఇక ఇప్పటికే నూతన ఐటీ నిబంధనలను తక్షణమే అమలు చేయాలంటూ కేంద్రప్రభుత్వం ట్విట్టర్ కు కొన్నాళ్ల క్రితం తుది నోటీసులు జారీ చేసింది. వీటిని అమలును ఇప్పటికీ ట్విట్టర్ చేయడం లేదు. దీంతో కేంద్రం ట్విట్టర్ నిషేధం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.