https://oktelugu.com/

భాగ్యనగరిలో బతుకు భారం?

ఇప్పుడు దేశంలో, రాష్ట్రంలో కరోనాకు ముందు.. కరోనాకు తర్వాత అన్నట్లుగా తయారయ్యాయి జీవితాలు. ఒక్క వైరస్‌ ప్రజలను ఎంతటి దారుణంగా దెబ్బతీసిందో అందరికీ తెలిసిందే. ఇంకా ఈ దుర్ఘటనలను భరిస్తూనే ఉన్నాం. ఉపాధి కోల్పోయి.. బతుకులు భారమై.. కూడు గూడు కోసం గోస పడుతున్నారు. మరోవైపు జాబ్స్‌ చేస్తున్న వారినీ కరోనా ముప్పుతిప్పలు పెట్టింది. ఇప్పటికీ సాఫ్ట్‌వేర్‌‌ కంపెనీలైతే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నడిపిస్తూనే ఉన్నాయి. Also Read: మరో చిచ్చు పెట్టిన నిమ్మగడ్డ రమేశ్ ఐటీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 2, 2021 / 11:19 AM IST
    Follow us on


    ఇప్పుడు దేశంలో, రాష్ట్రంలో కరోనాకు ముందు.. కరోనాకు తర్వాత అన్నట్లుగా తయారయ్యాయి జీవితాలు. ఒక్క వైరస్‌ ప్రజలను ఎంతటి దారుణంగా దెబ్బతీసిందో అందరికీ తెలిసిందే. ఇంకా ఈ దుర్ఘటనలను భరిస్తూనే ఉన్నాం. ఉపాధి కోల్పోయి.. బతుకులు భారమై.. కూడు గూడు కోసం గోస పడుతున్నారు. మరోవైపు జాబ్స్‌ చేస్తున్న వారినీ కరోనా ముప్పుతిప్పలు పెట్టింది. ఇప్పటికీ సాఫ్ట్‌వేర్‌‌ కంపెనీలైతే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నడిపిస్తూనే ఉన్నాయి.

    Also Read: మరో చిచ్చు పెట్టిన నిమ్మగడ్డ రమేశ్

    ఐటీ హబ్‌కు కేరాఫ్‌ హైదరాబాద్‌. హైటెక్‌ సిటీగా పేరొందిన హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులకు కొదవలేదు. అయితే.. హైదరాబాద్‌లో చాలావరకు ఐటీ కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌నే కంటిన్యూ చేస్తున్నాయి. దీంతో సాఫ్ట్‌వేర్లు అందరూ తమ ఇళ్లనే ఆఫీసులుగా మార్చుకుంటున్నారు. ఆఫీసులా మార్చాలంటే ఉన్న ఇల్లు ఎలాగూ సరిపోదు. దీంతో చాలా మంది పెద్ద ఇళ్లు కొనుక్కున్నారు. లగ్జరీ హౌస్‌లలోకి మారారు. ఒక్కొక్కటి 2000 చదరపు అడుగులు ఉండేవి ఎంచుకుంటున్నారు. దాంతో.. రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పెరిగింది. ఇళ్లకు డిమాండ్ ఎక్కువైంది. అద్దెలు కూడా పెరిగిపోయాయి. 2014 నుంచి 2020 వరకూ.. హైదరాబాద్‌లో ఇళ్ల అద్దెలు 26 శాతం పెరిగాయి. ఇండియాలోని 7 ప్రధాన మెట్రో నగరాలతో పోల్చితే.. అద్దెలు ఇక్కడే ఎక్కువ పెరిగాయి. అనరాక్ ప్రాపర్టీ కన్సల్టాంట్స్ జరిపిన సర్వేలో ఈ విషయం తేలింది.

    హైదరాబాద్ లాగానే ఐటీ హబ్‌గా మారుతున్న గుర్గావ్‌లో.. గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో… నెల వారీ అద్దెలు 17 శాతం పెరిగాయి. హైదరాబాద్‌లో వాణిజ్య సముదాయాలు పెరగడం కూడా అద్దెలు పెరగడానికి ఓ కారణంగా చెబుతున్నారు. ‘ఏడాది కాలంగా హైదరాబాద్‌లో ఆఫీసులను అద్దెకు తీసుకునే కంపెనీల సంఖ్య పెరుగుతోంది. ఈ కంపెనీలు ఇదివరకు ఎక్కడెక్కడో ఉండేవి. ఇప్పుడు తమ వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో.. హైదరాబాద్‌లో ఆఫీసులు తెరుస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఆల్‌రెడీ ఉన్నవి తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరిస్తున్నాయి. దాంతో.. ఇళ్లను ఆఫీసులుగా మార్చేస్తున్నాయి. అందువల్ల అద్దెలు పెరుగుతున్నాయి’ అని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టాంట్స్ చైర్మన్ అనుజ్ పురీ తెలిపారు.

    Also Read: కేటీఆర్ వర్సెస్ రాంచంద్రరావు.. పంచ్ ఇచ్చిన కేటీఆర్

    మున్ముందు కూడా అద్దెలు మరింత పెరిగే అవకాశం ఉండొచ్చంటున్నారు. ఈ సంవత్సరం ఇళ్ల అద్దెలు 3 శాతం నుంచి 7 శాతానికి పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. ఆఫీసులను లీజుకు తీసుకుంటున్నంత కాలం… ఇళ్ల అద్దెలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాలు 2014 నుంచి ఏటా… 3 నుంచి 6 శాతం వృద్ధి చెందుతున్నాయి. కరోనా వచ్చినప్పుడు అన్ని రంగాలలాగే రియల్ ఎస్టేట్ కూడా పడిపోయినా.. ఆ తర్వాత త్వరగానే కోలుకుంది. ఇప్పుడు లగ్జరీ అపార్ట్‌మెంట్లను లీజుకు కోరే వారి సంఖ్య పెరుగుతోంది. కొన్ని లొకాలిటీల్లో నెల వారీ అద్దెలను ఇప్పుడిప్పుడే పెంచుతున్నారు. మొత్తంగా భాగ్యనగరంలో సగటు జీవికి బతుకు మరింత కాబోతున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్