Bride Cracked the Groom’s Jaw: పెళ్లంటే నూరేళ్ల పంట.. ఆ కార్యం కోసం ఎవరైనా జీవితంలో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎంత పద్ధతిగా ఆ కార్యక్రమం జరగాలని చూస్తారు.. మందు, విందులకు వధూవరులు దూరంగా ఉండి సంప్రదాయబద్దంగా చేసుకుంటారు. కానీ ఇదంతా ఒకప్పుడు.. ఇప్పుడు పెళ్లి అంటేనే మందు, విందులు.. డ్యాన్సులు..
చాలా పెళ్లిళ్లలో వరుడు మందేసి చిందేసిన సందర్భాలు బోలెడు. కానీ ఈ వధువు మాత్రం తన కొత్త జీవితానికి స్వాగతం పలికే వరుడు పూజారి ఇచ్చే తీర్థం తాగకపోవడంపై అనుమానం వచ్చింది. ఎందుకు వరుడికి తీర్థం ఇవ్వడం లేదని పూజారిని ప్రశ్నించింది. అంటే పొగాకు నములుతున్నాడని.. అందుకే ఇవ్వడం లేదని పూజారి బదులిచ్చాడు. దీంతో సీరియస్ అయిన వధువు పూజారిని ఒక్కటి వేసింది. అనంతరం సంప్రదాయ పెళ్లిలో పోగాకు తింటావా? అని వరుడి దవడ పగులకొట్టింది.
వెంటనే పొగాకు ఊదివేయాలని వరుడికి హుకూం జారీ చేసింది. ఒక్క దెబ్బ వేసేసరికి వరుడు లేచి ఆ పోగాకు ఊదేశాడు. ఈ వీడియోను ఎవరో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.
పోగాకు తింటున్న వరుడి చెంప చెల్లుమనిపించిన వధువు.. దానికి సమర్థించిన పూజారిని కూడా చావబాదడం వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది.
వధువు చేసిన పనికి అందరూ ప్రశంసిస్తున్నారు. పెళ్లికి ముందే ఇంత కంట్రోల్ చేస్తున్న వధువు.. పెళ్లి అయ్యాక ఆ వరుడికి బడితె పూజ చేయడం ఖాయం అని చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.