Homeఎంటర్టైన్మెంట్సినిమా వాళ్ళ పెళ్లిళ్లు ఎందుకు నిలబడవు ?

సినిమా వాళ్ళ పెళ్లిళ్లు ఎందుకు నిలబడవు ?

movie stars weddings stand outసినిమా వాళ్ళ పెళ్లిళ్లు ఎందుకు నిలబడవు ? ఇది తరచూ వినిపించే డౌట్ ? విడాకులు తీసుకోవడమనేది సినిమా వాళ్ళల్లో చాలా సహజమైన అంశమా ? అసలు బాలీవుడ్‌ లో ఈ విడాకుల వ్యవహారాలు చాలా కామన్ అని అక్కడి ప్రేక్షక లోకం ఎందుకు భావిస్తోంది ? ఎందుకు విసిగి వేసారి పోయింది ? భర్త లేదా భార్య నచ్చకపోతే విడిపోవడమే మంచిదని అనుకున్నప్పుడు ఇక ఈ ప్రపంచంలో వివాహ వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోతుందేమో.

తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ ఖాన్‌, తన రెండో భార్య కిరణ్‌ రావుకు విడాకులు ఇస్తున్నాడు అనే వార్త మళ్ళీ బాలీవుడ్ లోని ప్రముఖుల దాంపత్య జీవితాల పై దృష్టి మళ్లేలా చేసింది. బాలీవుడ్‌ లో కోట్లల్లో భరణాలు ఇచ్చి మరీ భార్యకు విడాకులు ఇచ్చిన హీరోలు చాలామంది ఉన్నారు. ముందుగా చెప్పుకోవాల్సింది హృతిక్ రోషన్‌ గురించే చెప్పుకోవాలి. సుసాన్ ఖాన్‌ ను పెళ్లి చేసుకున్న తరువాత పదేళ్ల పాటు వీరి వైవాహిక జీవితం సాగింది.

ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కానీ హృతిక్ రోషన్‌, సుసాన్‌ కు విడాకులు ఇచ్చాడు, భరణంగా దాదాపు 400 కోట్ల రూపాయాలను డిమాండ్ చేసిందట సుసాన్‌. చివరకు ఆమెకు రూ.380 కోట్లను భరణంగా ఇచ్చినట్లు టాక్. మరో హీరో సైఫ్‌ అలీఖాన్‌ కూడా మొదటి భార్య అమృతా సింగ్‌ కు భారీ నష్టపరిహారమే చెల్లించి ఆమెను విడిచిపెట్టాడు.

ఆలాగే సంజయ్ దత్, రియా పిళ్లైతో విభేదాల కారణంగా విడిపోయాడు. రియాకి భరణంగా ఒక సీ ఫేసింగ్ అపార్ట్మెంట్, ఖరీదైన కార్ ను సంజయ్ భరణంగా ఇవ్వాల్సి వచ్చింది. ఇక కొరియో గ్రాఫర్‌ ప్రభుదేవా విడాకుల వ్యవహారం, ఆపై నయనతారతో ఘాటు ఎఫైర్ తంతు గురించి ప్రత్యేకంగా ముచ్చటించుకొక్కర్లేదు. యశ్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా సైతం మొదటి భార్య పాయల్ ఖన్నాకి విడాకులు ఇచ్చాడు. ఇలాంటి విడాకుల బాగోతాలు చాలానే ఉన్నాయి.

 

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular