
Best Telugu Comedy Movies: ‘నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం’ అని హాస్యబ్రహ్మ జంధ్యాల గారి చెప్పిన సిద్ధాంతం ఇది. ఈ సిద్ధాంతాలని ఆయన తన ప్రతి సినిమాలో తూచా తప్పకుండా పాటించారు, ఒక తరం ప్రేక్షకుల ఆయుష్షును పెంచారు. ఇప్పటి ఆయన సినిమాలని చూసి ఆనందంగా ఇంటిల్లిపాది నవ్వుకుంటున్నారు అంటే.. అది కచ్చితంగా జంధ్యాల గొప్పతనమే. మరి తెలుగు హాస్య చిత్రాల్లో అత్యుత్తమమైన పది గొప్ప హాస్య చిత్రాలు ఏమిటో చూద్దాం.
మిస్సమ్మ :
ఈ క్లాసిక్ సినిమాని ఎన్ని సార్లు చూసినా.. చూసినప్పుడల్లా చాలా నవ్వొస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్ – సావిత్రి నటనా చాతుర్యం కూడా ఈ సినిమా విజయానికి గొప్ప పునాది అయింది. గొప్ప హాస్య చిత్రాల్లోనే మొదటి వరుసలో నిలిచే చిత్రం ఇది .

చంటబ్బాయి :
నిజానికి ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు. కానీ చిరంజీవి కెరీర్ లోనే గొప్ప హాస్య చిత్రంగా ఇది నిలిచిపోయింది. మళ్ళీ మళ్ళీ చూసే సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటిగా ఉంటుంది.

ఆహా! నా పెళ్ళంట! :
హాస్య చిత్రానికి సరైన నిర్వచనం ఇచ్చిన చిత్రం ఇది. ఈ సినిమా నచ్చడానికి కారణాలు చెప్పాల్సిన అవసరమే లేదు. అంత గొప్ప హాస్య చిత్రం ఇది.

మైఖేల్ మదన కామరాజు :
ఇది అనువాద చిత్రమైనా, తీసింది మన సింగీతం శ్రీనివాస రావు గారే. ఈ చిత్రంలో నలుగురు కమల్ హాసన్ లు వుండరు. నాలుగు పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. ఇక హాస్యానికి వస్తే, టాప్ క్లాస్ కామెడీ ఉంటుంది.

ఏప్రిల్ ఒకటి విడుదల :
పెంట మీద టీవీ తీసుకువచ్చి దుబాయ్ టీవీ అని అమ్మేసి ఆ టీవీ పేలిపోయే దృశ్యం ఎప్పటికి మరువలేం. ఈ సినిమాలో కామెడీతో పాటు ఇళయరాజా పాటలు కూడా చాలా బాగుంటాయి. ఏది ఏమైనా వైవిధ్యమైన హాస్యానికి ఈ సినిమా చిహ్నం లాంటిది.

సొంతం :
ఈ సినిమాకి వున్న ఫ్యాన్ బేస్ వేరు. యూట్యూబ్ లో ‘సొంతం కామెడి సీన్స్’ అని ఒక వీడియో ఎప్పుడు హల్ చల్ చేస్తూనే ఉంటుంది.

ఆ ఒక్కటి అడక్కు :
రాజేంద్ర ప్రసాద్ గారి నట విశ్వరూపం చూసి తీరాల్సిందే. రాజమతగా నిర్మాలమ్మగారు నటన చూసి తీరాల్సిందే. ఇది రంభ మొదటి చిత్రం. రావు గోపాలరావు గారి హాస్య గొప్పతనం ఈ చిత్రంలో చూసి తెలుసుకోవాల్సిందే.

లేడీస్ టైలర్ :
కొంచెం అడల్ట్ కంటెంట్ ఎక్కువైనా… మంచి కామెడీ బాగా పండింది. బట్టల సత్యంగా మల్లికార్జునరావు నటన ఎప్పటికి గుర్తుంటుంది.

జంబ లకిడి పంబ :
ఈవివి గారి దర్శకత్వ ప్రతిభకి నిదర్శనం ఈ సినిమా. అలాగే గొప్ప విభిన్న హాస్యానికి నిర్వచనం ఈ సినిమా.
