https://oktelugu.com/

Electronics Prices: సామాన్యుడి నెత్తిన ధ‌ర‌ల బండ‌.. పెరగనున్న ఎలక్ట్రానిక్స్ వ‌స్తువుల ధరలు

Electronics Prices: కొత్త సంవత్సరం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారీ షాకిచ్చింది. న్యూఇయర్ ప్రారంభమై ఇంకా నెలరోజులు అన్న గడువక ముందే ఎలక్ట్రానికి అప్లయెన్సెస్ కంపెనీలు ధరలు పెంచేందుకు సిద్ధమయ్యాయి. వస్తువుల తయారీకి వినియోగించే ఇన్ పుట్ పరికరాల ధరలు పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కరోనా కారణంగా కంపెనీలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. సరైన సమయంలో ఇన్ పుట్ పరికరాల ఉత్పత్తి జరగగా, విదేశాల నుంచి దిగుమతి చేసుకుందామన్నా అక్కడ డిమాండ్‌కు సరిపడా సప్లయ్ లేకపోవడంతో […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 12, 2022 12:30 pm
    Follow us on

    Electronics Prices: కొత్త సంవత్సరం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారీ షాకిచ్చింది. న్యూఇయర్ ప్రారంభమై ఇంకా నెలరోజులు అన్న గడువక ముందే ఎలక్ట్రానికి అప్లయెన్సెస్ కంపెనీలు ధరలు పెంచేందుకు సిద్ధమయ్యాయి. వస్తువుల తయారీకి వినియోగించే ఇన్ పుట్ పరికరాల ధరలు పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కరోనా కారణంగా కంపెనీలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. సరైన సమయంలో ఇన్ పుట్ పరికరాల ఉత్పత్తి జరగగా, విదేశాల నుంచి దిగుమతి చేసుకుందామన్నా అక్కడ డిమాండ్‌కు సరిపడా సప్లయ్ లేకపోవడంతో భారీగా ధరలు వెచ్చించి ఆర్డర్లు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

    Electronics Prices:

    Electronics Prices:

    ఈ నేపథ్యంలోనే కంపెనీలు ధరల పెంపునకు మొగ్గు చూపినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం వలన సామాన్య, మధ్యతరగతి ప్రజలపై అధిక భారం పడనుంది. దేశంలో ద్రవ్యోల్భణం ఇప్పటికే భారీగా పెరిగింది. ధరలు ఆకాశన్నంటుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేతనాలు ఏ మాత్రం పెరగకపోగా గృహవినియోగ వస్తువులు, నిత్యావసరాల ధరలు మాత్రం రెట్టింపు స్థాయిలో పెరిగాయి.

    Also Read:  బయటపడిన సముద్ర డ్రాగన్ అస్తిపంజరం.. 30 అడుగుల పొడవు.. తల బరువు ఒక టన్ను..!

    తాజాగా ఉత్పత్తి కంపెనీలు తీసుకున్న నిర్ణయంతో ఏసీలు, ఫ్రీజ్‌లు, వాషింగ్ మెషిన్స్ ధరలు పెరగనున్నాయి. ముడిసరుకు, రవాణా ఖర్చులు పెరగడంతో ఈ ఏడాది ఫిబ్రవరి -మార్చి నెలలో వీటి ధరలు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

    ఎల్‌జీ, పనాసోనిక్, హైయర్ వంటి బ్రాండ్స్ ఇప్పటికే ధరలు పెంచినట్టు వార్తలు వస్తున్నాయి. గోద్రెజ్, సోనీ, హిటాచి వంటి బ్రాండ్స్ కూడా ఈ త్రైమాసికం చివరి నాటికి ధరలు పెంచే అవకాశం ఉందని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్య్యూఫాక్చరర్స్ అసోసియేషన్ (CEAMA) తెలిపింది. తమ కంపెనీ పాలసీలకు అనుగుణంగా గరిష్టంగా 7 శాతం వరకు ధరలు పెరగొచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ -19 మహమ్మారి వల్లే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

    Also Read:  వరుణ్ తేజ్‌ తో తమన్నా రొమాన్స్.. ఇది నిజంగా సర్ ప్రైజే !

    Tags