బ్రిటన్‌లోని మిడ్‌ల్యాండ్ ప్రాంతంలో 180 మిలియన్ ఏళ్ల కిందటి ‘సీ డ్రాగన్’(ఇచ్థియోసార్) అస్తిపంజరం బయటపడటంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గతంలో భూమిపై డైనోసార్స్ జీవించి ఉన్నాయనడానికి ఇది మరోక సజీవ సాక్ష్యం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సీ డ్రాగన్ చూసేందుకు డాల్ఫిన్ లాగా 30 అడుగుల పొడవు ఉంది. దీని పుర్రె బరువు 1 టన్ను ఉందట.. దీనిని 48 ఏళ్ల జో డేవిస్ ఫిబ్రవరి 2021లో కనుగొన్నారట..
Also Read: శివ మూవీతో టాలీవుడ్‌లో ఎన్ని మార్పులు వచ్చాయో తెలుసా.. హీరో పాత్ర నుంచి కథల వరకు..
గతంలో రట్‌ల్యాండ్ జలాల దగ్గర దొరికిన నీటి డ్రాగన్ 82 అడుగుల వరకు ఉండవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఇచ్థియోసార్‌లకు చాలా పెద్ద దంతాలు, కళ్ళు ఉన్నందున వాటిని సముద్ర డ్రాగన్‌లు అని పిలుస్తారట. ఇచ్థియోసార్లను ఫస్ట్ టైం 19వ శతాబ్దంలో మేరీ అన్నింగ్ అనే పురావస్తు సైంటిస్టు కనుగొన్నారు. ఈ సముద్ర జీవిపై డాక్టర్ డీన్ లోమాక్స్ చాలా పరిశోధనలు చేశారు. ఇచ్థియోసార్‌లు 250 మిలియన్ ఏళ్ల కిందట భూమిపై ఉనికిలోకి వచ్చాయి.
90 మిలియన్ ఏళ్ల కిందట ఇవి అంతరించిపోయాయి. సాధారణంగా సీ డ్రాగన్ పొడవు 55 అడుగుల వరకు ఉంటుందని సైంటిస్టుల అంచనా.. 240 మిలియన్ ఏళ్ల కిందట వీటి ఉత్పత్తి వేగంగా పెరిగిందని పరిశోధనలో తేలింది. కేవలం దీని తలను కొలిచినప్పుడు 6.5 అడుగులుగా ఉందట.. డైనోసార్లు అంతరించిపోయే క్రమంలో ఇచ్థియోసార్‌లు తిమింగలాల కంటే చాలా వేగంగా తమ పరిమాణాన్ని పెంచుకున్నాయట..తాజాగా వెలుగుచూసిన శిలాజం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చని అమెరికా ఆక్వాటిక్ పరిశోధకుడు లార్స్ ష్మిత్జ్ వెల్లడించారు.
Also Read: వరుణ్ తేజ్ తో తమన్నా రొమాన్స్.. ఇది నిజంగా సర్ ప్రైజే !
|