https://oktelugu.com/

Vishwambhara : విశ్వంభర సినిమాలో చిరంజీవి నెగటివ్ పాత్రలో కనిపిస్తున్నాడా..?

సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. అందులో దాదాపు 45 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీని ఏక చత్రాధిపత్యంతో ఏలుతున్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి...

Written By:
  • Gopi
  • , Updated On : November 23, 2024 / 11:34 AM IST

    Is Chiranjeevi appearing in a negative role in Vishwambhara?

    Follow us on

    Vishwambhara : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి తన దైన రీతిలో సత్త చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే ఆయన తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను చేత శభాష్ అనిపించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక చిరంజీవిలో సినిమా మీద ఉన్న కసి ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. యంగ్ హీరోలు సైతం ఆయనతో పోటీ పడే సాహసం చేయడం లేదు. అలాంటి చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో మరో భారీ ప్రయోగానికి తెలియపుతున్నాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన 2025 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో చిరంజీవి ఎనలేని గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా మరోసారి మెగాస్టార్ పవర్ ఏంటో చూపిస్తాడు అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ చాలా ఎక్స్ట్రాడినర్ గా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచడమే కాకుండా ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా అమితంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇందులో చిరంజీవి రెండు పాత్రల్లో నటిస్తున్నాడనే విషయం మనకు తెలిసిందే.

    అయితే అందులో ఒకటి నెగిటివ్ పాత్ర అనే ప్రచారం అయితే జరుగుతుంది. సోషల్ మీడియా వేదికగా గత రెండు మూడు రోజుల నుంచి చిరంజీవి ఈ సినిమాలో నెగిటివ్ పాత్ర చేస్తున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి వాటికి తగ్గట్టుగానే ఆయన ఈ సినిమాతో ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాడు అనేది కూడా చాలా క్లియర్ కట్ గా తెలియబోతుంది.

    అయితే చిరంజీవి ఇప్పటివరకు నెగిటివ్ పాత్రలు చాలా తక్కువగా చేశాడు. ఇక ఈ సినిమాలో ఆయన చేయబోయే పాత్ర మాత్రం చాలా ఎక్స్ట్రాడినర్ గా ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వశిష్ట ఈ సినిమాని చాలా కేర్ ఫుల్ గా చిత్రీకరించడమే కాకుండా మొదటి నుంచి చివరి వరకు ఈ సినిమా ప్రేక్షకులకు ఎక్కడ బోర్ కొట్టించకుండా కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ ను అందించడమే కాకుండా ఫాంటసీ ఎపిసోడ్స్ ని కూడా భారీగా జత చేసి ప్రేక్షకుల ముందు ఉంచబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా సక్సెస్ అనేది చిరంజీవి కంటే కూడా వశిష్టకే ఎక్కువ ఉపయోగాన్ని కలిగిస్తుంది.

    ఎందుకంటే ఇప్పటివరకు ఆయన చేసిన బింబిసారా సినిమా మంచి విజయాన్ని సాధించింది. కానీ తను స్టార్ డైరెక్టర్ గా ఎదగాలంటే మాత్రం ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఈ సినిమా సక్సెస్ అనేది చిరంజీవి కంటే కూడా వశిష్ట కే ఎక్కువ అవసరం…