BJP
BJP: స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 40 ఏళ్లు దేశంలో ఏకచత్రాధిపత్యం సాగించింది కాంగ్రెస్(Congress) పార్టీ. కేంద్రంలోనూ, రాష్ట్రాలోలనూ ఆ పార్టీనే అధికారంలో ఉండేది. అయితే ఎప్పుడూ కాంగ్రెస్ తమది డబుల్ ఇంజిన్(Dabul engin) సర్కార్ అని చెప్పుకోలేదు. ఎందుకంటే అప్పుడు ప్రత్యర్థి పార్టీలు కూడా బలంగా లేవు. నాడు కాంగ్రెస్‌కు రాజకీయ, సామాజిక సమీకరణలు సహకరించాయి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. బీజేపీ క్రమంగా పుంజుకుని.. కాషాయ భారతంగా మారిపోయింది. వరుసగా రాష్ట్రాలు బీజేపీ ఖాతాలో చేరుతున్నాయి.
దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. అందులో 20 రాష్ట్రాల్లో సొంతంగా లేదా మిత్ర పక్షాలతో కలిపి బీజేపీ(BJP) అధికారంలో ఉంది. ఉత్తరాదితోపాటు పశ్చిమ, మధ్య భారత్‌లోని అనేక రాస్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. ఇక ఈశాన్య రాష్ట్రాల్లోనూ హవా చాటుకుంది. ఇక దక్షిణాన చూస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలంగాణలో బలమైన ప్రతిపక్షంగా ఉంది. కర్ణాటకలో అధికాం చేపట్టింది. మరో చాన్‌స కోసం ఎదురు చూస్తోంది. కేరళ, తమిళనాడు(Kerala, Tamilnadu)మాత్రం బీజేపీకి చిక్కడం లేదు. ఇక విపక్షాలను చూస్తే కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో మాత్రమే అధికారంలో ఉంది. కేరళలో వామపక్ష పార్టీలు, తమిళనాడులో డీఎంకే, పశ్చిమబెంగాళ్‌లో తృణమూల్ కాంగ్రెస్, పంజాబ్(Panjob)లో ఆప్ అధికారంలో ఉన్నాయి. ఇక జమ్మూ కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలోకి వచ్చింది. అంటే ప్రత్యర్థి పార్టీలన్నీ కలిసి కూడా 8 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ, దాని మిత్ర పక్షాలు అధికారంలో ఉన్నాయి.
ఆ రాష్ట్రాలపై బీజేపీ కన్ను..
ఇక మిగిలిన ఎనిమిది రాష్ట్రాల్లోని పశ్చిమబెంగాల్, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌పై బీజేపీ కన్నేసింది. వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రాలను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. ఇందుకు ఇప్పటికే ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. తర్వాత మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ కాషాయ జెండా ఎగురవేయాలని భావిస్తోంది. మొత్తంగా బీజేపీ దూకుడు చూస్తుంటే దేశం మొత్తం కాషాయ మయం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈమేరకు విస్తరణకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ఇక విపక్షాల అనైక్యత బీజేపీకి కలిసి వస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ ఇతర ఫ్రంటులను కూల్చేది. లేదంటే తమ చెప్పు చేతల్లో పెట్టుకునేది. ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ యేతర రాష్ట్రాలను ఇలాగే కబ్జా చేస్తోంది.
టార్గెట్ 2047..
బీజేపీ టార్గెట్ 2047 లక్ష్యంతో పనిచేస్తోంది. స్వాతంత్య్రం వచ్చి 2047 నాటికి వందేళ్లు పూర్తవుతుంది. అప్పటి వరకు దేశం మొత్తం కాషాయమయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో పార్టీకి బలమైన పునాదులు వేస్తోంది. ఉత్తరాన వ్యతిరేకత ఉన్న మితా ప్రాంతాల్లో మద్దతు పొందేలా.. దక్షిణాన వ్యతిరేకత ఉన్నా.. ఉత్తరాదిన మద్దతు పొందేలా వ్యూహాత్మకంగా కమలం పార్టీ ముందుకు సాగుతోంది. 1947 నుంచి 40 ఏళ్లు కాంగ్రెస్ బలంగా ఉంది.. 2047 నాటికి బీజేపీని బలంగా మార్చాలన్నదే కమలనాథుల వ్యూహంగా కనిపిస్తోంది. వందేళ్ల నాటికి కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచుతోంది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: The bjp is in power in 20 states either alone or with allies
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com