Mrunal Thakur: సినిమా అనేది రంగుల ప్రపంచం ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఏదైనా సినిమాలో ఓకే అయిన తర్వాత సగం సినిమా షూటింగ్ అయి కూడా దాంట్లో నుంచి నటీనటులను తప్పించిన సందర్భాలు కోకొల్లలు.. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దలు చెప్పిన సామెతను సినిమా వాళ్లు తూచా తప్పకుండా పాటిస్తారు. అలా కాకుండా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం అంతా అయిపోయాక ఎంత చక్కదిద్దుకోవాలన్నా జరిగేది శూన్యమే. ఇప్పుడు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ది కూడా అదే పరిస్థితి. ఈ బ్యూటీ మొదట బుల్లితెరపై సందడి చేసి.. తర్వాత మెల్లిగా వెండితెర మీద తళుక్కుమంది.
వాస్తవానికి మృణాల్ తన సినీ కెరీర్ మొదట స్టార్ట్ చేసింది మాత్రం మరాఠీ సినిమాలతోనే. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి అక్కడ పలు హిందీ సినిమాల్లో నటించింది. అక్కడ తన శ్రమకు తగిన ఫలితం రాకపోకడంతో మృణాల్ తీవ్ర నిరాశకు గురైంది. కెరీర్ ఆటుపోట్ల మధ్య ఉన్న సమయంలో మృణాల్ కు తెలుగులో సీతారామం లాంటి అద్భుతమైన సినిమాలో నటించే అవకాశం దక్కింది.
సీతారామంలో దుల్కర్ సల్మాన్ సరసన సీత పాత్రలో ఒదిగి పోయింది. ఆ ఒక్క సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులను కట్టి పడేసింది. తన నటనతో అందరినీ మెప్పించి వావ్ అనిపించుకుంది. అందుకు తగినట్లే ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. సీతారామం తర్వాత మృణాల్ కు తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో ఇక మృణాల్ ఇక వేరే భాషల ఇండస్ట్రీ వైపు చూసింది లేదు. రెండో సినిమాగా నాని తో చేసిన హాయ్ నాన్న కూడా సూపర్ హిట్ అయి మంచి కలెక్షన్లను రాబట్టింది. అదే టైమ్ లో మృణాల్ కు కోలీవుడ్ నుంచి శివ కార్తికేయన్ కు జంటగా ఏ ఆర్ మురుగదాస్ డైరెక్షన్లో లో ఓ సినిమా ఆఫర్ వచ్చింది. కానీ రీజన్ ఏంటో తెలీదు కానీ మృణాల్ మాత్రం ఆ అవకాశాన్ని వదిలేసుకుంది.
కోలీవుడ్ అవకాశం వదులుకుని అదే టైమ్ లో మృణాల్ టాలీవుడ్ లో విజయ్ తో కలిసి చేసిన ఫ్యామిలీ స్టార్ సినిమా డిజాస్టర్ అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మృణాల్ కు కోలీవుడ్ నుంచి మరో ఆఫర్ వచ్చిందేలేదు.. గ్లామర్ విషయంలో ఎలాంటి కండిషన్స్ పెట్టకపోయినా అమ్మడికి సినిమా ఛాన్స్ లు మాత్రం తగ్గాయనేది వాస్తవం. అయితే ఇటీవల మృణాల్ ను ఎందుకు ఎక్కువ సినిమాలు చేయడం లేదని అడగ్గా, తను చేస్తున్న పాత్రలను ఆడియన్స్ ఆదరిస్తున్నారని అందుకే పాత్రల సెలక్షన్లలో ఆచితూచి అడుగులేస్తున్నట్లు ముద్దుగుమ్మ తెలిపింది.