ఈ టీ ఖరీదు ఏకంగా వెయ్యి రూపాయలు.. ప్రత్యేకత ఏమిటంటే..?

సాధారణంగా టీ ధర ఎంత ఉంటుందనే ప్రశ్నకు ఎవరైనా 5 రూపాయల నుంచి 20 రూపాయల మధ్య ఉంటుందని చెబుతారు. ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో అయితే టీ కొంచెం ఎక్కువ ధరే పలుకుతుంది. ఒక టీ షాప్ లో మాత్రం టీ చెల్లించాలంటే ఏకంగా 1,000 రూపాయలు చెల్లించాలి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతాలోని ఒక టీ షాప్ లో 15 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు దాదాపు 100 రకాల టీలు దొరుకుతాయి. […]

Written By: Navya, Updated On : November 22, 2020 9:21 am
Follow us on


సాధారణంగా టీ ధర ఎంత ఉంటుందనే ప్రశ్నకు ఎవరైనా 5 రూపాయల నుంచి 20 రూపాయల మధ్య ఉంటుందని చెబుతారు. ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో అయితే టీ కొంచెం ఎక్కువ ధరే పలుకుతుంది. ఒక టీ షాప్ లో మాత్రం టీ చెల్లించాలంటే ఏకంగా 1,000 రూపాయలు చెల్లించాలి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతాలోని ఒక టీ షాప్ లో 15 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు దాదాపు 100 రకాల టీలు దొరుకుతాయి.

పార్ధ గంగూలీ అనే వ్యక్తి నడిపే ఈ టీ షాప్ గురించి కోల్ కతాలో తెలియని వారుండరు. ఇతని టీ షాప్ పేరు నీర్జాస్ టీ దుకాణం. ఏడేళ్ల క్రితం గంగూలీ టీ అంటే కేవలం రుచి మాత్రమే కాదు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించాలనే ఉద్దేశంతో ఈ హోటల్ ను ప్రారంభించాడు. 100కు పైగా టీలు దొరికే ఈ హోటల్ లో ఒక్కో టీకు ఒక్కో రేటు. టీ ధర ఎక్కువగా ఉంటే ఆ టీ ద్వారా దొరికే రుచి, లభించే ఆరోగ్య ప్రయోజనాలు సైతం ఎక్కువగానే ఉంటాయి.

గంగూలీ అమ్మే టీలలో మిగతా టీలతో పోల్చి చూస్తే మస్కటెల్ టీ పేరుతో అమ్మే టీకు డిమాండ్ ఎక్కువ. మస్కటెల్ టీ వల్లే గంగూలీ పశ్చిమ బెంగాల్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో సైతం ఫేమస్ అయ్యాడు. ఈ మస్కటెల్ టీ తాగాలంటే మాత్రం వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మొదట్లో ధర ఎక్కువని అనిపించినా ఈ టీ రుచిని ఆస్వాదించిన తరువాత ఆ ధర తక్కువే అని అనిపిస్తోందని టీ ప్రియులు చెబుతున్నారు.

మొదట్లో ఉద్యోగంలో చేరిన గంగూలీకి ఎందుకో ఉద్యోగం నచ్చలేదు. అయితే అప్పటికే అతనికి టీ బాగా చేస్తాడనే పేరు ఉండటంతో అతని స్నేహితులు టీ స్టాల్ పెట్టుకోవాలని సూచించారు. టీ స్టాల్ కోసం గంగూలీ స్నేహితులే సహాయసహకారాలు అందించారు. అలా 2014లో మొదలైన టీ స్టాల్ ద్వారా గంగూలీ నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.