Assam Governament : *ఇక 1935 నాటి ఆ చట్టం చెల్లదు..అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం వెనుక ఏం జరిగిందంటే?*

భారత దేశంలో వివాహ బంధానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి వైవాహిక పద్ధతులు, అనుబంధాలు పాశ్చాత్య దేశాలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయి. అందుకే అమెరికా, రష్యా, సింగపూర్, జపాన్, లండన్‌తోపాటు పలు దేశాలకు చెందిన యువతులు భారతీయ పద్ధతిలో వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : July 21, 2024 1:58 pm
Follow us on

Assam Governament : భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో అసోంకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక ఆ రాష్ట్ర ప్రస్తుత సీఎం హిమంత బిశ్వశర్మ పాలనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అందుకే వరుసగా రెండోసారి బీజేపీని అధికారంలోకి తెచ్చారు. తాజాగా ఆయన అసోంలో ముస్లిం వివాహ చట్టాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. 1935 నాటి ముస్లిం వివాహ, విడాకుల చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. ఈమేకు కొత్త చట్ట రూపొందించి క్యాబినెట్‌లో ఆమోదం తెలిపారు. అసెంబ్లీలో చట్టం చేసేందకు ప్రవేశపెట్టారు. అయితే పాత చట్టం రద్దును ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తోంది. నూతన చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీ నుంచి బాయికాట్‌ చేసింది. కానీ తాను ఎది అనుకుంటే.. అది అమలు చేసే అసోం సీఎం హిమంత బిశ్వశర్మ.. తాజాగా కొత్త ముస్లిం వివాహన, విడాకుల చట్టం అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో బిల్లు అమోదం తర్వాత చట్టం అమలులోకి రాబోతోంది. అయితే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ పార్టీ మాత్రం వ్యతిరేకిస్తోంది. మత విశ్వాసాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని తప్పు పడుతోంది. 80 ఏళ్లుగా అమలులో ఉన్న చట్టాన్ని ముస్లింలు వ్యతిరేకించడం లేదని కాంగ్రెస్‌ అభిప్రాయపడుతోంది. అలాంటప్పుడు చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తోంది. ఇప్పటికే కేంద్రం ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేసింది. దీంతో దేశంలో ముస్లిం మహిళలకు న్యాయం జరిగిందని ఆ మత పెద్దలు, మహిళలు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో అసోం ప్రభుత్వం 1935 నాటి ముస్లిం వివాహ, విడాకుల చట్టాన్ని పూర్తిగా రద్దు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

అసోం జనాభాలో 40 శాతం ముస్లింలు..
ఇదిలా ఉంటే 1951లో అసోం జనాభాలో ముస్లిం జనాభా 12 శాతం ఉండేది. ప్రస్తుం ఆ రాష్ట్రంలో ముస్లిం జనాభా మొత్తం జనాభాలో 40 శాతానికి చేరింది. దేశంలో ఏ రాష్ట్రంలో పెరగనంత వేగంగా అసోంలో ముస్లిం జనాభా పెరిగింది. మరో 20 ఏళ్లలో అసోం ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మారుతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఆ రాష్ట్రంలో రాబోయే 20 ఏళ్లలో ముస్లిం జనాభా 30 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇక హిందు జనాభా రాబోయే 20 ఏళ్లలో 16 శాతం మాత్రమే పెరుగుతుందని భావిస్తున్నారు. దీంతో అక్కడ హిందువు మైనారిటీలుగా మారతారన్న ఆందోళన నెలకొంది. 2011 జనాభా లెక్కల ప్రకారం అసోంలో ముస్లిం జనాభా 1.40 కోట్లు. ప్రస్తుతం 2 కోట్లు ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం ముస్లిం జనాభా నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ముస్లిం వివాహ చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ శాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్, మేఘాలయతో పోలిస్తే ముస్లిం జనాభా అసోంలోనే ఎక్కువగా ఉంది.

1935 ముస్లిం వివాహ చట్టం..
భారతదేశంలో, ముస్లిం వివాహం అనేది పురుషుడు, స్త్రీ మధ్య జరిగే పౌర ఒప్పందం. వివాహాన్ని రద్దు చేయడం భర్త తలాక్‌), భార్య (ఖులా) లేదా పరస్పరం (ముబారత్‌)గా పేర్కొంటారు. తలాక్‌ అనే పదాన్ని పేర్కొనడం ద్వారా ముస్లిం పురుషుడు తన భార్యకు చట్టబద్ధంగా విడాకులు ఇచ్చేందుకు వీలు కల్పిస్తుంది. అయితే దీనిని సుప్రీం కోర్టు రద్దు చేసింది.

చట్టం రద్దుకు కారణాలివీ..
ముస్లిం వివాహ చట్టం రద్దుకు అసోం ప్రభుత్వం పలు కారణాలు చూపుతోంది. ఈ చట్టం బహుభార్యత్వాన్ని ప్రోత్సమిస్తోంది చెబుతోంది. ఇది భారత వివాహ చట్టానికి విరుద్ధమంటోంది. ఇక 1935 ముసిం వివాహ చట్టం బాల్య వివాహాలను ప్రోత్సహిస్తోందని అసోం ప్రభుత్వం చెబుతోంది. ఇది కూడా భారత వివాహ వయసుకు విరుద్ధంగా ఉందని పేర్కొంటోంది. భారత వివాహ వయసు పురుషుడికి 21 ఏళ్లు, మహిళకు 18 ఏళ్లు ఉండాలి. కానీ ముస్లిం వివాహ చట్టంలో మైనారిటీ వివాహాలకు అనుమతి ఉంది. అందుకే నూతన చట్టం తెస్తున్నట్లు తెలిపింది. దీంతో ముస్లిం బాలికలకు, మహిళలకు న్యాయం జరుగుతుందని చెబుతోంది.