Indian Epics : పురాణ గాధల్లో అనేక గ్రామాలు, పట్టణాల గురించిన ప్రస్తావన కూడా ఉంది. మన దేశ రాజధాని ఢిల్లీతోపాటు అఖండ భారతంగా, హిందూ సామ్రాజ్యంగా విరాజిల్లిని దేశంలో అనేక పట్టణాల గురించి పురాణాల్లో ఉంది. ప్రస్తుతం ఆ గ్రామాలు, పట్టణాలు వివిధ కారణాలతో వేర్వేరు దేశాల్లో ఉన్నాయి. ముఖ్యంగా భారతీయ పండితులు, భారతీయ సాహిత్యంలోని పురాణాల శైలి ‘సంస్కృతి సంశ్లేషణ‘లో గొప్ప ప్రభావాన్ని చూపిందని పేర్కొన్నారు. ఆచార సంబంధమైన ఆచారాల నుండి వేదాంతం వరకు, కల్పిత ఇతిహాసాల నుంచి వాస్తవ చరిత్ర వరకు, వ్యక్తిగత ఆత్మపరిశీలన యోగా నుండి సామాజిక ఉత్సవాల వరకు, దేవాలయాల నుంచి తీర్థయాత్రల వరకు, ఒక దేవుడి నుంచి మరొక దేవుడికి, దేవతల నుంచి∙తంత్రం వరకు విభిన్న విశ్వాసాలను నేయడం మరియు ఏకీకృతం చేయడంలో పాత నుండి కొత్త వరకు అనేక అంశాల గురించి నేటి తరం, భవిష్యత్ తరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక పునాణాల ప్రకారం.. నాటి పాలకు అనేక నగరాలు, పట్టణాలతోపాటు ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, కోటలు నిర్మించారు. శాసనాలు చెక్కించారు. వాని ప్రకాం కొన్ని నగరాలు, పట్టణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
– కుశ నగరం.. ఇది ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉంది. ఈ నగరాన్ని సీతారాముల పెద్ద కుమారుడు అయిన కుశుడు కట్టించాడని పురాణాల్లో ఉంది.
– లవ పురం… ఇది సాతారాముల చిన్నకుమారుడు లవుడు కట్టించిన నగరం. ప్రస్తుతం ఈ నగరం పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఉంది.
– తక్షశిల.. ఇది శ్రీరాముడి తమ్ముడు అయిన భరతుని పెద్ద కుమారుడు తక్షుడు నిర్మించాడు. ఇది కూడా పాకిస్తాన్‌లోనే ఉంది.
– పుష్కలావతి.. లేదా పురూషు పురం.. ఇది శ్రీరాముడి తమ్ముడు భరతుని రెండో కుమారుడు పుష్కరుడు నిర్మించాడు. ప్రస్తుతం ఇది పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఉంది.
– వ్యాస మహర్షి పుట్టిన స్థలం దబోలి.. ఇది ప్రస్తుతం నేపాల్‌లో ఉంది. వ్యాసుడు తన శిష్యులకు వేదాలు బోధించిన ప్రాంతం సీతాపురం. ఇది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఉంది. వ్యాసుడు మహాభారతం రాసిన చోటు ఉత్తరాంచల్‌లోని మన గ్రామం. ప్రతిష్టాన పురం.. పురూరౌలి రాజధాని ఇది. ప్రస్తుతం అలహాబాద్‌లో ఉన్న ఝార్సీ.
– సాల్వ రాజ్యం సావిత్రి, సత్యవంతుడు నివసించిన ప్రాంతం. ఇది ప్రస్తుతం కురుక్షేత్ర దగ్గర ఉంది.
– కౌరవుల రాజధాని ఉత్తరప్రదేశ్‌లోని హస్తినాపూర్. ఇక కృష్ణుని మేనమామ కంసుని రాజధాని మధుర ఉత్తరప్రదేశ్‌లో ఉంది.
– పాడు రాజు మొదటి భార్య కుంతి పుట్టిన రాజ్యం కుతీపురం. ఇది గ్వాలియర్‌లో ఉంది. పాడురాజు రెండో భార మావిత్రీ తేవి పుట్టిన ప్రాంతం మాత్రిపురం పాకిస్తాన్ ప్రావిన్స్‌లోని పంజాబ్‌లో ఉంది.
– ద్రోణ నగరి.. ద్రోణుడు నివసించిన ప్రాంతం. ప్రనస్తుం డెహ్రాడూన్.
– కురు పాండవులు విద్యాభ్యాసం చేసిన స్థలం కురుగ్రామం. ప్రస్తుతం ఇది గుర్గావ్. హరియాణాలో ఉంది.
– కర్ణుడు పాలించిన అంగరాజ్యం కాబాల్ ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ రాజధాని.
– శ్రీకృష్ణుడు, బలరాముని ద్వారక నగరం.. ద్వారక. ఇది గుజరాత్‌లో ఉంది.
– విధర్బ.. దమయంతి, రుక్ష్మిణీదేవి తండ్రులు ఏలిన రాజ్యం. మహారాష్ట్రలో ఉంది.
– చేదిన రాజ్యం.. శిశుపాలుడు ఏలిన రాజ్యం. ప్రస్తుతం బుందేల్‌ఖండ్… మధ్యప్రదేశ్‌లో ఉంది.
– కుచేలుడు నివసించిన చోటు పోర్‌బందర్.. గుజరాత్‌లో ఉంది.
– పాంచాల దేశం. దృపద మహారాజు రాజ్యం. యటా జహనాపూర్ ఉత్తర ప్రదేశ్‌లో ఉంది.
– పాండవులు అజ్ఞాతవాసం చేసిన నగరం విరాటపురం. ప్రస్తతం విరాట్‌పురం. రాజస్థాన్‌లో ఉంది.
– నరకాసురుని రాజధాని దిస్‌పూర్.. ఇది అసోంలో ఉంది.
– కపిలవస్తు.. ఇది బుద్ధని జన్మస్థలం. నేపాల్‌లో ఉంది. బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్రాంతం గయ. బిహార్‌లో ఉంది.
– గౌతముడు చనిపోయిన స్థలం ఖుషీనగర్.. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లో ఉంది.
భారత దేశంలో ఉన్న స్థలాలు..
భాగవతం లేదా భారతంలో మహేంద్రున్ని మహా విష్ణువు మొసలి బారి నుంచి రక్షించిన స్థలం నేపాల్‌లోని దేవుగాం. నృసింహస్వామి హిరణ్య కచకుడిని సంహరించిన స్థలం ఆంధ్రప్రదేశ్‌లోని అహోబిలం. జమదగ్ని మహర్షి ఆశ్రమం జమాలియా ఉత్తరప్రదేశ్‌లో ఉంది. మాహిష్మతి.. ఇది కార్తవీర్జాదుడి రాజధాని. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో ఉంది. మహేశ్వర్‌గా పిలుస్తున్నారు. శమంతక పంచక.,. ఇది పరుశరాముడి 21సార్లు శత్రువలపై దండెత్తి వారి రక్తంతో ఐదు మడుగులు నెలకొల్పిన స్థలం కురుక్షేత్రం. ఇక మహాభారతంలో ధుర్యోధనుడిని సంహించిన స్థలం కురుక్షేత్ర హర్యానాలో ఉంది. పరుశరాముడు తన గొడ్డలితో సముద్రాన్ని వెనక్కు పంపి తన కోసం సృష్టించుకున్న స్థలం కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక సముద్ర తీరప్రాంతం.
– మహేంద్ర పర్వతం.. ఇది పరశురాముడు తపస్సు చేసిన స్థలం. పశ్చిమ ఒరిస్సాలో ఉంది. నిషాధ రాజ్యం.. నల మహారాజు నివసించిన ప్రదేశం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఉంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Where are the cities in indian epics now and what are their new names
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com