Kuwait : భారతీయ మరణాల్లో గల్ఫ్ దేశాలకు భారత్ నుంచి ఎక్కువగా ఉపాధి నిమిత్తం వెళ్తుంటారు. గతంలో నిరక్షరాస్యులు ఎక్కువగా నిర్మాణరంగంలో పనిచేయడానికి దుబయ్, మస్కట్, కువైట్ తదితర గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు. తర్వాత ఉన్నత విద్యావంతులు కూడా అవకాశాలను అంది పుచ్చుకుని గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. మొదట్లో పురుషులు, మహిళలు ఒంటరిగా వెళ్లేవారు. ఉద్యోగ రిత్యా అక్కడే స్థిరపడుతున్నారు. ఇక కుటుంబాలకు దూరంగా ఉండి చాలా మంది గుండెపోటు, ఇతర వ్యాధుల బారినపడి మరణించేవారు. తర్వాత ఒంటరి తనంతో కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తర్వాత గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు కుటుంబాలతో ఉండేందుకు అనుమతి ఇవ్వడంతో చాలా మంది వెళ్తున్నారు. ఈ క్రమంలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగ రిత్యా కువైట్ వెళ్లిన ఓ కుటుంబం… అక్కడే స్థిరపడింది. శుక్రవారం(జూలై 18న) అగ్ని ప్రమాదంలో మృతిచెందింది. ఈ ఘటన కువైట్‌లోని అబ్బాసియా ప్రాంతంలోని ఓ ప్లాట్లో జరిగింది.
కేరళకు చెందిన నలుగురు..
కేరలకు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగా అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భార్యభర్తలు, ఇద్దరు పిల్లలు అగ్నికి ఆహుతయ్యారు. రాత్రి భోజనం చేసి అందరూ నిద్రపోయిన సమయంలో ఇంట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న కుటుంబం సజీవ దహనమైంది. మృతులు మాథ్యూ ములక్కల్(40), అతని భార్య లిని అబ్రహం(38), వారి పిల్లలు ఇరిన్(14), ఇస్సాక్ (9)గా గుర్తించారు. వీరిది కేరళలోని అలప్పుజ జిల్లాలోని నీరట్టుపురానికి చెందినవారు.
ఇటీవలే ఇండియా వచ్చి వెళ్లారు..
మాథ్యూ ములక్కల్ కుటుంబం ఇటీవలు కేరళకు వచ్చి శుక్రవారమే అక్కడకువెళ్లింది. ఆదేరోజు రాత్రి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కుటుంబం మొత్తం అగ్నికి ఆహుతైంది. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కువైట్ పోలీసులు తెలిపారు.
ఏసీ ఫెయిల్యూర్‌తో..
ఇదిలాం ఉండగా ప్రమాదానికి ఏసీ ఫెయిల్ కావడమే కారణమని ప్రాథమిక విచారణలో పోలీసులు ఉర్తించారు. ప్రమాద సమయంలో వారంతా విషపూరిత వాయువులు పీల్చుకుని మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు. ఇక గతనెల ఓ అపార్టుమెంట్‌లో భారీగా మంటలు చెలరేఆయి. ఈ ఘటనలో మొత్తం 49 మంది మరణించగా 45 మంది భారతీయులే అని అధికారులు తెలిపారు. ఇందులో కేరళ, తమిళనాడుకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. మరణించిన వారి కుటుంబాలకు కేరళ ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం అందించాలని నిర్ణయించింది.