Maha Kumbh mela : మహా కుంభమేళాకు భక్తులు పొటెత్తుతున్నారు. జనవరి 26న ఉత్తరప్రదేశ్(UttaraPradesh)లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ కుంభమేళా ప్రారంభమైంది. ఇందుకోసం యూపీ సర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఒకటి రెండు ఘటనలు మినహా కుంభమేళా ప్రశాంతంగా సాగుతోంది. మరోవైపు ఈకుంభమేళాలో సామాన్యులు నుంచి దేశ ప్రథమ మహిళ వరకు అందరూ పుణ్నస్నానాలు ఆచరించారు. అఘోరాల, నాగసాధువుల నుంచి కుబేరుల వరకు ప్రయాగ్‌రాజ్ బాట పట్టారు. పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. నాగసాధువులు, అఘోరీలు పుణ్యస్నానాలు చేయడం కామనే. కానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడు రిలయన్స్ ఇండస్ట్రీస్(Relance Indastrees)అధినేత అయిన ముకేశ్ అంబానీ కూడా కుంఒటుంంతో కలిసి ప్రయాగ్‌రాజ్‌లో పవిత్ర స్నానం ఆచరించారు. నాలుగు తరాలకు చెందిన ఆయన కుటుంబం సంగం ఘాట్ వద్ద భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. తల్లి కోకిలా బెన్, కుమారులు ఆకాశ్, అనంత్, కోడళ్లు శ్లోక, రాధిక, మనవరాళ్లు పృథ్వి, వేదతోపాటు సోదరీమణులు దీప్తి, సల్గావ్కర్, నీనా కొఠారీలతో కలిసి పుష్కర స్నానం చేశారు. ముఖేశ్ అంబానీ అత్త పూనంబెన్ దలాల్, వదిన మమతాబెన్ దలాల్ కూడా త్రివేణి సంగమంలో మునక వేశారు.
పవిత్ర నదిలో పుణ్యస్నానం..
గంగా, యమున, సరస్వతి పవిత్ర జలాల సంగమం వద్ద నిత్యం లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అందరితోపాటే అపర సంపన్నుడు అయిన అంబానీ కుటుంబంతోపాటు నాలుగు తరాల వారు ఈ మహా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంది. ఇక నిరంజని అఖాడాకు చెందిన స్వామి కైలాసానంద గిరిజీ మహరాజ్ గంగాపూజ చేశారు. ముకేశ్ అంబానీ పరమార్థనికేతన్ ఆశ్రమానికి చెందిన స్వామి చిదానంద సరస్వతి మహరాజ్‌ను కలిశారు. ఆశ్రమంలో అంబానీ కుటుంబం స్వీట్లు, లైఫ్ జాకెట్లు(Life Jockets) పంపిణీ చేసింది.
భక్తులకు సేవలు..
ఇదిలా ఉంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తీర్థయాత్ర సేవ ద్వారా మహాకుంభమేళా యాత్రీకులకు సేవలు అందిస్తోంది. ఇది యాత్రీకుల శ్రేయస్సు, సౌలభ్యం కోసం ఒక సామాజిక కార్యక్రమంగా రిలయన్స్ ఇండస్ట్రీ ఫౌండేషన్(Relaince Foundation) నిర్వహిస్తోంది. ఈ ఫౌండేషన్ అనేక శిబిరాల్లో ఆహార సేవలను కూడా అందిస్తోంది. ప్రతీరోజు లక్షల మందికి ఈ ఆహార సేవను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక ప్రయాణికులకు కూడా రిలయన్స్ ఫౌండేషన్ సేవలు అందిస్తోంది. సమగ్ర ఆరోగ్య రక్షణ, సురక్షితమైన రావాణా, మెరుగైన కనెక్టివిటీ వంటి సౌకర్యాలు అందిస్తోంది. పవిత్ర జలం భద్రత, సౌకర్యవంతమైన విశ్రాంతి మండలాలు, స్పష్టమైన మార్గదర్శకత్వం, గార్డుల నుంచి సహాయం తదితర సేవలు కూడా చేస్తోంది.
અંબાણી પરિવારની 4 પેઢીએ મહાકુંભમાં લગાવી ડૂબકી#Reliance #MukeshAmbani #Mahakumbh2025 #News18Original pic.twitter.com/y27KqemmK8
— News18Gujarati (@News18Guj) February 11, 2025