Sukumar and Devisree Prasad : ఒక సినిమా సక్సెస్ లో హీరో, దర్శకుడి తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కూడా కీలకపాత్ర వహిస్తాడు… ప్రతి సీన్ ఎంగేజింగ్ గా రావడంలో మ్యూజిక్ డైరెక్టర్ తనవంతు పాత్ర అయితే పోషిస్తాడు. చాలా మంచి సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చినట్లయితే ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా ఎలివేట్ అవుతూ ఉంటాయి. తద్వారా సినిమా మీద హైప్ రావడమే కాకుండా సినిమా ప్రతి ప్రేక్షకుడికి నచ్చుతుంది. తద్వారా సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తుంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు రామ్ చరణ్(Ram Charan)… సుకుమార్ (Sukumar) డైరెక్షన్ లో రంగస్థలం (Rangasthalam) సినిమా చేసిన రామ్ చరణ్ ఈ సినిమాలో తనదైన నటన ప్రతిభను కనబరిచాడు. ముఖ్యంగా చెవిటివాడి పాత్రలో ఒదిగిపోయి నటించి ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. అందుకే మెగాస్టార్ చిరంజీవి ఏ రేంజ్ లో అయితే సక్సెస్ అయ్యాడో రామ్ చరణ్ కూడా అదే రేంజ్ స్టార్ డమ్ సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక కెరీర్ మొదట్లో అతనికి యాక్టింగ్ రాదు అంటూ కామెంట్స్ చేసిన వారందరూ రంగస్థలం సినిమా చూసి అతన్ని మెచ్చుకున్నారు. ఇక ఆ సినిమాలో తన నటనలో చాలా వరకు చేంజ్ ఓవర్ చూపించిన రామ్ చరణ్ ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. కెరియర్ మొదట్లో ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు ప్రయోగత్మకమైన సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో మరొక సినిమా రాబోతుంది. మరి ఈ సినిమాతో రామ్ చరణ్ తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక సుకుమార్ సైతం ‘పుష్ప 2’ (Pushpa 2) లాంటి భారీ సక్సెస్ తర్వాత మరొక పెద్ద సక్సెస్ ని అందుకోవాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తోంది…
ఇక సుకుమార్ కెరియర్ మొదట్లో చేసిన ఆర్య సినిమా నుంచి మొన్న వచ్చిన పుష్ప 2 సినిమా వరకు అన్ని సినిమాలకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. మరి ఇక రాబోయే సినిమాలకు కూడా తనే మ్యూజిక్ అందిస్తాడంటూ చాలా మంది చాలా రకాల కామెంట్లైతే చేస్తున్నారు.
మరి మొత్తానికైతే ఇప్పుడు రామ్ చరణ్ సినిమా కోసం సుకుమార్ దేవిశ్రీప్రసాద్ ని పక్కనపెట్టి తమిళంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్న అనిరుధ్ ను తీసుకుంటున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే అందరూ అనుకుంటున్నట్టిగానే అనిరుధ్ (Anirudh) ను ఈ సినిమా కోసం తీసుకుంటున్నాడా దేవి శ్రీ ప్రసాద్ ను పక్కన పెట్టేసాడా అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
నిజానికి దేవిశ్రీప్రసాద్ కి సుకుమార్ కి మధ్య చాలా మంచి బాండింగ్ అయితే ఉంది. అందుకే దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) ఏ దర్శకుడికి ఎలాంటి మ్యూజిక్ ఇచ్చిన కూడా సుకుమార్ కు మాత్రం చాలా మంచి మ్యూజిక్ ఇస్తాడు అంటూ చాలామంది కామెంట్లైతే చేస్తుంటారు. మరి వీళ్ళిద్దరూ ప్రొఫెషనల్ గానే కాకుండా పర్సనల్ గా కూడా చాలా మంచి ఫ్రెండ్స్ కావడం విశేషం…