Abu Dhabi: అందాల నగరం అబుదాబి. బహుళ అంతస్తులు, చుట్టూ పచ్చదనంతో తొణికిసలాడుతూ ఉంటుంది నగరం. అందుకే ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక అభిమానులను సొంతం చేసుకుంది. నిత్యం ఈ నగరానికి పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. పారిశ్రామిక, వాణిజ్య నగరంగా కూడా గుర్తింపు సాధించింది. అటువంటి నగర పరిరక్షణకు, నగర అందాలను మరింత పెంచేందుకు అబుదాబి మునిసిపాల్టీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. బాల్కనీలో బట్టలు ఆరవేయకూడదని ప్రజలకు ఆదేశాలిచ్చింది. కవేళ అలా చేస్తే వెయ్యి దిర్హమ్స్(రూ.20వేలు) జరిమానా విధిస్తారట.
అలా బాల్కనీలో బట్టలు ఆరవేయడం వల్ల సిటీ అందం దెబ్బతింటుందనేది మున్సిపల్ అధికారుల మాట. అందుకే లాండ్రీ డ్రైయింగ్ గానీ, ఎలక్ట్రిక్ డ్రైయర్స్ వాడడం లేదా ఇతర మార్గాల ద్వారా బట్టలు ఇంట్లోనే ఆరవేసుకోవాలని మునిసిపల్ అధికారులు సూచించారు. ఒకవేళ తమ హెచ్చరికలను బేఖాతరు చేసి బాల్కనీలో బట్టలు ఆరవేస్తే మాత్రం రూ.20వేలు కట్టాల్సిందేనని అన్నారు. నేర తీవ్రతను బట్టి ఈ జరిమానా మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. ఇప్పుడది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Also Read: Star Anchor Divorce: విడాకులు తీసుకోవడం చాలా తెలికైనా విషయం.. కానీ..!
నెటిజెన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. నగర అందాలను కాపాడేందుకు వ్యక్తుల స్వేచ్ఛను హరిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. కానీ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడమనేది పౌరులు, నివాసితుల బాధ్యతగా అక్కడి అధికారులు పేర్కొంటున్నారు.
యూఏఈ దేశ రాజధాని అయిన అబుదాబిలో ఇండియాతో పాటు ఉప ఖండం దేశాల నుంచి వెళ్లిన వారు అధికం. ఉద్యోగ, ఉపాధి కోసం అక్కడకు వేలాది మంది వెళుతుంటారు. ఇటువంటి వారు మరీ ముఖ్యంగా ఈ నిబంధనలు తెలుసుకోవాలని అక్కడి అధికారులు సూచిస్తున్నారు. లేకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అబుదాబి మునిసిపల్ అధికారుల నిర్ణయం అక్కడి విదేశీయులకు సరికొత్త చిక్కు తెచ్చి పెట్టింది.
Also Read:BJP Congress Attack: బీజేపీ, కాంగ్రెస్ అటాక్.. కేసీఆర్ నిర్ణయం ఎటు వైపు?