https://oktelugu.com/

BJP Congress Attack: బీజేపీ, కాంగ్రెస్ అటాక్.. కేసీఆర్ నిర్ణయం ఎటు వైపు?

BJP Congress Attack: తెలంగాణ రాష్ర్ట సమితి ప్లీనరీ కొనసాగుతోంది. హైదరాబాద్ లోని మాదాపూర్ హెచ్ఐీసీసీలో నేడు ప్లీనరీ నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడు వేల మంది పాల్గొనే ఇందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీనిపై కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సమయం ఆసన్నమైందని చెప్పడం గమనార్హం. ప్లీనరీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం విమర్శల దాడి చేస్తూనే ఉన్నారు. కేసీఆర్ కుటుంబ వైభోగానికి ఒక తరం నాయకులు ప్రాణాలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 27, 2022 / 06:52 PM IST
    Follow us on

    BJP Congress Attack: తెలంగాణ రాష్ర్ట సమితి ప్లీనరీ కొనసాగుతోంది. హైదరాబాద్ లోని మాదాపూర్ హెచ్ఐీసీసీలో నేడు ప్లీనరీ నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడు వేల మంది పాల్గొనే ఇందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీనిపై కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సమయం ఆసన్నమైందని చెప్పడం గమనార్హం. ప్లీనరీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం విమర్శల దాడి చేస్తూనే ఉన్నారు. కేసీఆర్ కుటుంబ వైభోగానికి ఒక తరం నాయకులు ప్రాణాలు త్యాగాలు చేశారని చెబుతున్నారు.

    BJP Congress Attack

    అధికారమే ప్రధానంగా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. వారికి ధనమే మూలం. ఏం అక్కర్లేదు. స్వార్థపూరిత ఆటోచనలు, కుట్రలు, కుతంత్రాలతో కాలం గడుపుకోవడమే ప్రధానంగా టీఆర్ఎస్ ముందకు వెళ్తోంది. నైతిక విలువలు పట్టవు. ప్రజా సంక్షేమం అసలే అక్కర్లేదు. పైగా ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారట అని ఎద్దేవా చేస్తున్నారు. డబ్బు సంపాదనలో టీఱర్ఎస్ నేతలను మించిన వారు లేరు. వారే మొత్తం రాష్ట్ర ఆదాయాన్ని పర్సంటేజీల చొప్పున పంచుకుంటున్నారు.

    తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది అసువులు బాసినా చివరకు లబ్ధి పొందింది మాత్రం కేసీఆర్ కుటుంబమే. నిజాం కంటే ఎక్కువ ఆస్తులు కూడబెట్టారు. ఇంకా కూడబెడుతూనే ఉన్నారు సాగునీటి ప్రాజెక్టుల్లో వేల కోట్లు, అసెంబ్లీ నిర్మాణంలో, ఇంకా అనేక అంశాల్లో వారి పర్సంటేజీలు లెక్కలేకుండా ఉన్నాయి. అందుకే తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని చెబుతున్నా ఉద్యోగులకు మాత్రం ఎందుకు సరైన సమయానికి జీతాలు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

    కేసీఆర్ కుటుంబంపై అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో కేసీఆర్ కుటుంబంపై ముప్పేట దాడి మొదలైంది. ఇన్నాళ్లు ఎదురులేని విధంగా దూసుకెళ్లిన టీఆర్ఎస్ కు ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ ఎదురుదాడితో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. భవిష్యత్ లో టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకమే అని చెప్పుకోవాల్సి వస్తోంది.

    Also Read: అర్జంటుగా కేసీఆర్ ను ఢిల్లీ పంపాలి.. కేటీఆర్ ను సీఎం చేయాలి.. అంతే!

    ఓ పక్క ప్రత్యర్థి పార్టీలు మరోపక్క మంత్రుల తీరు వివాదాస్పదంగా మారడంతో కేసీఆర్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మొన్న మల్లారెడ్డి, నిన్న అజయ్ కుమార్, రేపు మరే మంత్రో ఎవరో ఒకరు ఏదో ఒక వివాదంలో దూరుతూనే ఉన్నారు. దీంతో పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది. రాబోయే ఎన్నికల్లో వీరితో ఎన్నికలకు వెళితే కచ్చితంగా ఓటమి తథ్యమని పీకే స్పష్టం చేయడంతో కేసీఆర్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

    మొత్తానికి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్నా కూట్లో రాయి ఏరలేనోడు ఏట్లో రాయి ఏరతాడా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మొదట సొంత కుంపటి సరిచేసుకోమను తరువాత జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పొచ్చని ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. దీంతో కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారో అని అందరిలో సందేహాలు వస్తున్నాయి.

    Also Read: టీఆర్ఎస్ ప్లీనరీ: కేసీఆర్ ప్లాన్ ఏంటి? ఏం చేయబోతున్నాడు?

    Tags