Jagan Shock To AP Teachers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచిత్రనిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో అభాసుపాలవుతోంది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు మే 20 వరకు సెలవులు ఇవ్వడం లేదని చెప్పింది. అత్వవసర పరిస్థితి అయితే తప్ప టీచర్లు అందుబాటులో ఉండాలని సూచించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా వెలువరించింది. ఈ నేపథ్యంలో మెడికల్ సేవలు అవసరమైన వారు తప్ప మిగతా వారు అందుబాటులో ఉండాలని నిర్దేశించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా కాలంలో విద్యార్థులునష్టపోయిన కాలాన్ని ప్రస్తుతం వినియోగించుకుని వారిలో చదువు నేర్పించాల్సిన అవసరాన్ని గుర్తించింది. ఇందుకోసమే ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేస్తోంది.

కరోనా సమయంలో రెండేళ్లుగా విద్యార్థుల చదువులు అటకెక్కాయి. ఫలితంగా వారికి రావాల్సిన బేసిక్స్ రావడం లేదు. దీంతో వారు తీవ్రంగా నష్టపోయినట్లు లెక్కలోకి తీసకుంది. అందుకే వారికి కోల్పోయిన నష్టాన్ని భర్తీ చేసే క్రమంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులకు నష్టపోయిన సబ్జెక్టు పునశ్చరణకు అవకాశం ఏర్పడుతోంది. కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని టీచర్లు ఆక్షేపిస్తున్నారు. ఏకపక్ష విధానాలతో ఉద్యోగులకు ఇబ్బందులు తెస్తున్నారని వాపోతున్నారు
ప్రభుత్వం మే 6 నుంచి జులై 4 వరకు సెలవులు ప్రకటించింది.దీంతో అందరిలో అనుమానాలువ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే విద్యాసంవత్సరం నష్టపోయిన విద్యార్థులకు మళ్లీనష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం ఎందుకు ఇలా ఆలోచిస్తుందనే విషయంపై విమర్శలు వస్తున్నాయి.ఏకపక్ష నిర్ణయాలతో అటు విద్యార్థులను ఇటు ఉపాధ్యాయులను వేధింపులకు గురిచేస్తోంది. దీనిపై ప్రభుత్వం ఏం చేయాలని అనుకుందో కూడా తెలియడం లేదు. ఈ క్రమంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ గాడిలో పడటం కష్టమే.

ఎప్పుడైనా విద్యాసంవత్సరం జూన్ 12తో ప్రారంభం కావాల్సి ఉన్నా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే సెలవులతో దాదాపు 15 రోజులు నష్టపోవాల్సి ఉంటుంది. దీంతో వాటిని ఎందులో చేర్చుతారని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి సర్కారు ముందు చూపు లేని విధానాలతో ఇబ్బందులు వచ్చే అవకాశముంది. దీనిపై పునరాలోచించి మరోసారి నిర్ణయం తీసుకుని విద్యార్థుల భవిష్యత్ ను రక్షించాల్సిన బాధ్యత సర్కారుపై ఉందని చెబుతున్నారు. దీనికి గాను మరోసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని విద్యార్థుల భవిష్యత్ ను చక్కదిద్దాలని కోరుతున్నారు.
Recommended Videos