Sree sitarama kalyanam in Canada : కెనడా ఒంటారియో రాష్ట్రంలోని పికెరింగ్ నగరం ‘శ్రీ సీత రామ’ నామజపంతో పరవశించి పోయింది. డుర్హం తెలుగు క్లబ్ వారు శ్రీ నర్సింహా చార్యుల సారథ్యంలో సీత రామ కల్యాణ మహోత్సవంను కన్నుల పండుగగా నిర్వహించారు. డుర్హం వాస తెలుగు ప్రజలు అందరు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరు అయ్యి జానకి రాముల ఆశీర్వాదాలు అందుకున్నారు.

ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధులుగా ఒంటారియో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పీటర్ బెత్లెన్ఫాల్వయ్ మరియు వితబీ నగర డిప్యూటీ మేయర్ ఎలిజబెత్ రాయ్ హాజరు అయ్యారు.

మంత్రి పీటర్ మాట్లాడుతూ శ్రీ సీత రాముల జీవితం అందరికి ఆదర్శం అని ప్రపంచం అంత వసుదైక కుటుంబం అని, కెనడా దేశం దానికి ఉదాహరణ అని తెలియచేసారు.

డిప్యూటీ మేయర్ ఎలిజబెత్ మాట్లాడుతూ ,భారత దేశ సంస్కృతిని కాపాడుకుంటున్నందుకు తెలుగు వారందరిని అభినందించారు. అలాగే వన్ వరల్డ్ వన్ ఫామిలీ నినాదం తో అంత కలిసి మెలిసి ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్య అతిధిలు ఇద్దరు డుర్హం తెలుగు క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులని అభినందించి సత్కరించారు.

కళ్యాణం అనంతరం భక్తులకు స్వామి వారి ప్రసాదాలను భక్తులకు అందచేశారు.ఈ కార్యక్రమానికి డీటీసీ ప్రెసిడెంట్ నర్సామిహ రెడ్డి కార్య వర్గ సభ్యులు రవి మేకల ,శ్రీకాంత్ సింగిసేతి ,వెంకట్ చిలివేరు,రమేష్ ఉప్పలపాటి,వాసు,గుణ శేఖర్ రెడ్డి ,కమల మూర్తి ,శివ ,యువి చెరుకూరి లు హాజరు అయ్యారు.

Recommended Videos