Chandrababu: చంద్రబాబుపై ఒక అపవాదు ఉండేది. వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు.. కోర్టులో ఆయన గుప్పెట్లో ఉంటాయి.. స్టేలు తెచ్చుకుని కేసులు ముందుకు సాగకుండా అడ్డం పడతాడు.. ఇలా ఏవేవో ఆయనపై ఆరోపణలు కొనసాగుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు చేసే ఈ ఆరోపణలు క్రమేపి ప్రజల్లో కూడా బలంగా ఉండి పోయాయి. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే ఈ ఆరోపణల్లో ఎంతవరకు నిజం ఉందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు కాదని.. అలా అయితే సీఎంలు పాలన సాగించలేరని న్యాయ కోవిదులు చెబుతూ వచ్చారు. చంద్రబాబు తప్పు చేసినట్లు ఆధారాలు లేవని.. ఆయన కేసు నిలబడదనిఎక్కువమంది వాదించారు.కానీ సీన్ కట్ చేస్తే18 రోజులపాటు చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
చంద్రబాబు ఈ పరిస్థితిని చూడలేదు. ఆయనపై ఎన్నో ప్రభుత్వాలు కేసులు నమోదు చేశాయి. కానీ పూర్తిస్థాయిలో విచారణకు నోచుకోలేదు. కొన్ని కేసుల్లో చంద్రబాబు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకో గా.. మరికొన్ని కేసుల విషయంలో ప్రభుత్వాలే ఉదాసీనంగా వ్యవహరించి కొట్టివేశాయి. అయితే ఈ క్రమంలో వ్యవస్థలను మేనేజ్ చేస్తారన్న అపవాదును చంద్రబాబు ఎదుర్కొన్నారు. జనాల్లో కూడా ఆ అభిప్రాయం బలపడిపోయేలా చేశారు.
అయితే ఆది నుంచి ఈ కేసు విషయంలో చాలామంది లైట్ తీసుకున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి, లోక్సత్తా నేత జయప్రకాష్ నారాయణ అయితే చాలా ఈజీగా తేల్చేశారు. పద్ధతి ప్రకారం అన్నీ చేసి క్యాబినెట్ ఆమోదంతో నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినంత మాత్రాన సీఎం దీనికి ఎలా బాధ్యుడవుతారని ప్రశ్నించారు. ఇలాంటి వ్యవహారాల్లో సీఎంను బాధ్యుడిని చేయాలంటే అసలు దేశంలో ప్రభుత్వాలే నడవవు అని తేల్చేశారు. కేసు ఇంత స్పష్టంగా ఉన్నా సరే చంద్రబాబును రిమాండ్ విధించారు అంటే.. ఆయన వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తారని.. అదే జరిగితే రిమాండ్ విధించరు కదా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒకవేళ ఆయనకు వ్యవస్థలపై పట్టు ఉంటే ఒకటి రెండు రోజుల్లో బయటపడేవారు కదా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే చంద్రబాబు పై ఉన్న అపవాదు పక్కకు వెళ్లిపోయింది. ఇప్పుడు జగన్ అండ్ కోనే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారన్న సందేహాలు ప్రారంభమయ్యాయి.