Pawan Kalyan: పవన్ ని మాత్రమే ప్రజలు నమ్మడానికి కారణం అదే

వైసిపి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్పందన విభాగాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక స్పందన విభాగం, మండల, గ్రామస్థాయిలో వినతుల విభాగాన్ని ఏర్పాటు చేశారు.

Written By: Dharma, Updated On : August 18, 2023 5:35 pm

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: పవన్ వారాహి యాత్ర విశాఖలో చురుగ్గా జరుగుతోంది. రేపటితో ముగియనుంది. అయితే క్షేత్రస్థాయిలో పవన్ వైసీపీ నేతల అక్రమాలపై పోరాడుతున్న తీరు అభినందనలను అందుకుంటోంది. రిషికొండ, ఎర్రమట్టి దెబ్బల సందర్శనని సైతం ప్రజల ఆహ్వానిస్తున్నారు.ఈ సమయంలో పవన్ నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రభుత్వ వ్యవస్థల కంటే పవన్ నే ప్రజలు ఎక్కువగా నమ్మినట్లు కనిపిస్తోంది.

వైసిపి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్పందన విభాగాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక స్పందన విభాగం, మండల, గ్రామస్థాయిలో వినతుల విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్ని నియమించారు. గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. దాదాపు 19 శాఖలకు సంబంధించి సహాయ కార్య దర్శులను నియమించారు. ప్రజల ముంగిటకు పాలన తీసుకొచ్చేందుకు ఈ వ్యవస్థలు ఎంతగానో ఉపయోగపడతాయని వైసీపీ నేతలు ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ఇవన్నీ ఉత్త ప్రకటనలేనని తేలిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి ప్రజల నుంచి దాదాపు 400 వినతులు రావడమే అందుకు కారణం. ప్రభుత్వం స్పందిస్తే పవన్ వద్దకు అన్ని వినతులు ఎందుకు వస్తాయి? ఇప్పుడు అదే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

వాస్తవానికి జనవాణి కార్యక్రమానికి వస్తున్న వినతులకు వీలైనంతవరకూ పరిష్కార మార్గం చూపిస్తున్నారు. చాలామంది దయనీయ పరిస్థితిని చూసి అప్పటికప్పుడే ఆర్థిక సహకారాన్ని ప్రకటిస్తున్నారు. అటు పవన్ దూకుడుకు భయపడి అధికారులు సైతం ఆ పనులకు పరిష్కార మార్గం చూపిస్తున్నారు. అటు క్షేత్రస్థాయిలో జనసైనికులు సైతం సమస్య పరిష్కారమయ్యే వరకు అధికారులను వెంటాడుతున్నారు. దీంతో చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. అందుకే జన వాణి కార్యక్రమానికి వినతులు పోటెత్తుతున్నాయి.

నిన్నటి విశాఖ జనవాణి కార్యక్రమంలో సామాజిక సమస్యలపై ఎక్కువ శాతం వినతులు వచ్చాయి. వైసీపీ నేతల అరాచకాలపై బాధితులు బాహటంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేశారు. వారందరికీ పవన్ భరోసా ఇచ్చారు. తప్పకుండా సమస్యలపై దృష్టి పెడతానని హామీ ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే పవన్ దృష్టికి వచ్చిన ఎటువంటి సామాజిక సమస్య పైన అయినా ఆయన మాట్లాడతారన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. మొన్నటికి మొన్న ఓ లారీ డ్రైవర్ వచ్చి ఏపీలో గ్రీన్ టాక్స్ వసూలు పై ఫిర్యాదు చేశారు. దానిపైనే పవన్ మాట్లాడారు. సామాన్య జనాల సమస్యలకు పవన్ పెద్దపీట వేస్తున్నారు. వారు చెబుతున్న దాన్ని సావధానంగా వింటున్నారు. అందుకే ప్రజలకు కూడా పవన్ అంటే నమ్మకం క్రమేపీ పెరుగుతోంది.