Modi: మోడీ దూకుడుకు కారణం అదేనంటా..!

2019 లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోడీ ఈ స్థాయిలో ఎన్నికల క్యాంపెయినింగ్ ను నిర్వహించిన దాఖలాలు లేవు. కానీ,ఈసారి మాత్రం ఆయన దూకుడుగా వెళ్లడంలోనూ కారణం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Written By: Neelambaram, Updated On : May 19, 2024 6:14 pm

Modi

Follow us on

Modi: దేశంలో లోక్ సభకు జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాని మోదీ హవా స్పష్టంగా కనిపిస్తుంది. రామ మందిర నిర్మాణం,ఆర్టికల్ 370 రద్దు, అవినీతి రహిత పాలన, సబ్ కా సాత్ సబ్ కా వికాస్.. వికసిత్ భారత్ వంటి నినాదాలు ఆయనకు ఎనలేని కీర్తి,ప్రతిష్టలను తెచ్చిపెట్టాయి. ఒక విధంగా ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బిజెపి పార్టీని కాకుండా..మోదీనే స్టార్ ఐకాన్ గా భావిస్తున్నారు. దేశంలోని అన్ని లోక్సభ నియోజకవర్గాల్లోనూ ఆయన చరిష్మా స్పష్టంగా కనిపిస్తోంది.

అయితే బిజెపి,ప్రధాని మోడీ ప్రభంజనం దేశంలో ఈ స్థాయిలో ఉన్నప్పటికీ..ఆయన మాత్రం ఎన్నికల ప్రచారంలో ఎక్కడ తన దూకుడును తగ్గించడం లేదు. ఇప్పటి వరకు నాలుగు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నాలుగు దశల్లోనూ బిజెపికి పట్టున్న రాష్ట్రాలతో పాటు..ఆ పార్టీ ప్రభావం అంతగా లేని స్టేట్స్ లో కూడా మోడీ విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దాదాపు ప్రతి సెగ్మెంట్ కవర్ అయ్యేలా ఆయన తన ప్రచార షెడ్యూల్ ను రూపొందించుకున్నారు. ఒకవేళ ఏదైనా పార్లమెంట్ నియోజకవర్గ ప్రచారానికి మోడీ వెళ్లలేని పరిస్థితులు ఉంటే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా,ఇతర మంత్రులు క్యాంపెనింగ్ నిర్వహించే చూసుకున్నారు.

2019 లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోడీ ఈ స్థాయిలో ఎన్నికల క్యాంపెయినింగ్ ను నిర్వహించిన దాఖలాలు లేవు. కానీ,ఈసారి మాత్రం ఆయన దూకుడుగా వెళ్లడంలోనూ కారణం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో ఉత్తరప్రదేశ్,మహారాష్ట్ర, కర్ణాటక,బీహార్,రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో దాదాపు 200 సీట్లు బీజేపీ కి వచ్చాయి. ఆయా రాష్ట్రాల్లో వచ్చిన ఈ సీట్లతోనే కేంద్రంలో బిజెపి భారీ మెజారిటీని సాధించగలిగింది. అయితే ఈసారి రాజకీయంగా మహారాష్ట్రలో స్పీట్ పాలిటిక్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ శివసేన,ఎన్సిపి రెండు ముక్కలయ్యాయి. అలాగే కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రాజస్థాన్లోనూ ఆ పార్టీ బలీయంగానే ప్రభావాన్ని చూపించగలుగుతుంది. ఉత్తరప్రదేశ్ లోను బిజెపియేతర పక్షాలన్ని దాదాపు ఒకటయ్యాయి.

ఈ నేపథ్యంలోనే 2019 పార్లమెంటు ఎన్నికలతో పోల్చితే.. బిజెపి హవా దేశవ్యాప్తంగా ఏమాత్రం తగ్గకూడదనే ఆలోచనతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల్లో కాలుకు బలపం కట్టుకొని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో బిజెపి మెజార్టీ సీట్లను సాధించిన రాష్ట్రాల్లో పరిస్థితులు ఏమైనా అటు ఇటుగా మారితే మిగతా రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ స్థానాలను సాధించడం ద్వారా దేశవ్యాప్తంగా భాజాపాకు ఉన్న పట్టును నిలుపుకునేందుకు అవకాశం ఉంటుందనే అంచనాతోనే మోడీ ఎలక్షన్ లో విస్తృతంగా క్యాంపెనింగ్ చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.